అందం, అభినయంతో తెలుగు చిత్ర పరిశ్రమను ఊపేసింది అందాల తార లయ.. స్వయంవరం, ప్రేమించు, నీ ప్రేమకై వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు ఈ అలనాటి అందాల తార హీరోయిన్ లయ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ మూవీస్ పై తనకున్న ఇష్టాన్ని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది.. కేవలం ఫ్యామిలీ విషయాలు మాత్రమే కాకుండా ట్రెండీ సాంగ్స్ కు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తూ నెటిజన్లను ఆక్టటుకుంటుంది. ఇప్పటికే పలు హిట్ సాంగ్స్‌కు స్టెప్పులేసి అదరగొట్టిన లయా.. తాజాగా మరోసారి నెట్టింట రచ్చ చేసింది..
తాను నటించిన హనుమాన్ జంక్షన్ సినిమాలోని గోల్ మాల్ పాటకు అద్భుతంగా స్టెప్పులేసింది. హిట్ ట్రాక్ గోల్ మాల్ పాటకు తన పార్ట్ నర్ సారికరెడ్డితో కలిసి ఇరగదీసే డ్యాన్స్ చేసింది. నేను నటించిన హనుమాన్ జంక్షన్ లోని గోల్ మాల్ అంటే చాలా ఇష్టం.. మీకు కూడా నచ్చుతుందనుకుంటున్నా.. అయితే ట్రై చేయండి అంటూ వీడియోను షేర్ చేస్తూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అద్భుతంగా డ్యాన్స్ చేశారని.. సూపర్.. కళ్లు తిప్పుకోనివ్వకుండా చేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి లయా యూఎస్ లో ఉంటున్న సంగతి తెలిసిందే.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.