Viral Photo: ఈ ఫోటోలోని అల్లరి పిల్ల ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. నార్త్ టూ సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్ ఈ చిన్నది..

|

Aug 03, 2022 | 1:01 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. త్వరలోనే టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఎవరో గుర్తుపట్టండి.

Viral Photo: ఈ ఫోటోలోని అల్లరి పిల్ల ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. నార్త్ టూ సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్ ఈ చిన్నది..
Actress
Follow us on

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సెలబ్రెటీలకు సంబంధించిన చిన్ననాటి ఫోటోస్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడం.. ఇలా భాషతో సంబంధం లేకుండా నటీనటుల బాల్యస్మృతులు నెట్టింట సందడి చేస్తున్నాయి. తాజాగా మరో హీరోయిన్ చిన్ననాటి జ్ఞాపకం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోలో క్యూట్ క్యూట్ చూపులతో చిలిపి నవ్వులతో అమాయకంగా కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. త్వరలోనే టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఎవరో గుర్తుపట్టండి.

పైన ఫోటోలో ఎంతో అల్లరిగా కనిపిస్తున్న ఆ చిన్నారి బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కథానాయికగా అరంగేట్రం చేసిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ అమ్మడు మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ చిత్రంలో నటించింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించగా.. అనన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది ఈ చిన్నది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం రౌడీ హీరోతో కలిసి లైగర్ ప్రమోషన్లలో పాల్గొంటుంది అనన్య.

ఇవి కూడా చదవండి

Actress 1

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.