Aadhaar Pan Card: మరణించిన వారి ఆధార్, పాన్ కార్డులను ఏం చేయాలి? ఈ విషయం తెలియకపోతే ఇప్పుడే తెలుసుకోండి..

|

Nov 01, 2021 | 6:16 PM

Aadhaar Pan Card: ఆధార్ కార్డు, పాన్ కార్డు.. భారతదేశంలో వీటికి ఎంతటి విలువ ఉందో అందరికీ తెలిసిందే. ఇవి లేకపోతే ఎలాంటి ప్రభుత్వ పని కానీ, ఆర్థిక లావాదేవీలు..

Aadhaar Pan Card: మరణించిన వారి ఆధార్, పాన్ కార్డులను ఏం చేయాలి? ఈ విషయం తెలియకపోతే ఇప్పుడే తెలుసుకోండి..
Aadhaar Pan Card
Follow us on

Aadhaar Pan Card: ఆధార్ కార్డు, పాన్ కార్డు.. భారతదేశంలో వీటికి ఎంతటి విలువ ఉందో అందరికీ తెలిసిందే. ఇవి లేకపోతే ఎలాంటి ప్రభుత్వ పని కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ జరుగవంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వ ధృవీకరణ పత్రాలు, ప్రభుత్వ పథకాలు, ఇతర అవసరాలకు ఆధార్ కార్డు, పాన్ కార్డు తప్పనిసరిగా కావాల్సి ఉంటుంది. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలన్నా.. ఇతర ధృవీకరణ పత్రాలు కావాలన్నా ఆధార్, పాన్ కార్డులు కీలకం. అంతటి కీలకమైన పాన్, ఆధార్ కార్డులు పోయినా, దుర్వినియోగం అయినా భారీ నష్టం జరుగుతుంది. అందుకే, ఆ కీలక పత్రాల గురించిన సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకూడదని చెబుతుంటారు.

అయితే, జీవించి ఉన్న వ్యక్తికి సంబంధించిన ఆధార్, పాన్ కార్డులను దుర్వినియోగపరిస్తే ఏదోలా వాటిని రీప్లేస్ చేయడం, మార్పించుకోవడం, ఫిర్యాదు చేయడం తదితర చర్యలు తీసుకుంటారు. మరి చనిపోయిన వారి ఆధార్, పాన్ కార్డులు పోతే, అక్రమార్కుల చేతులకు చిక్కి దుర్వినియోగానికి గురైతే.. ఏంటి పరిస్థితి?. చనిపోయిన వారి ఆధార్, పాన్ కార్డులు దుర్వినియోగం అవకుండా, వాటిని ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చనిపోయిన వారి పాన్ కార్డ్‌ను ఏం చేయాలి?
ఐటీ రిటర్న్స్(ITR) దాఖలు చేయడానికి పాన్ కార్డ్ అత్యంత కీలకమైంది. అలాగే, బ్యాంక్ ఖాతా నుంచి డీమ్యాట్‌ అకౌంట్ ఓపెనింగ్ వరకు ప్రతీ అంశంలో పాన్ కార్డు అవసరం పడుతుంది. అందుకే దీనికి అంత ప్రాధాన్యం. అయితే, మరణించిన వ్యక్తికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు, ఐటీ రిటర్న్స్ సొమ్ము అకౌంట్‌లో జమ అవడం, డిపార్ట్‌మెంట్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పాన్‌కార్డును మనుగడలోనే ఉంచాలి. పనులన్నీ పూర్తయ్యాక అకౌంట్ క్లోజ్ చేయడానికై ఆదాయపు పన్ను శాఖకు దరఖాస్తు పెట్టుకోవాలి. అయితే, ఇది మరణించిన వారి చట్టపరమైన వారసులు మాత్రమే చేయడానికి వెసులుబాటు ఉంది. ఇతరు వచ్చి పాన్ కార్డ్ అకౌంట్‌ను క్లోజ్ చేయమని కోరడానికి అనుమతి లేదు. లేదంటే.. మరణించిన పాన్ కార్డ్ అకౌంట్‌ను మరొక వ్యక్తి పేరు మీదకు బదిలీ చేయమని కూడా ఐటీ శాఖను కోరవచ్చు. అయితే, మరణించిన వ్యక్తి పాన్ కార్డ్ భవిష్యత్‌లో మీకు అవసరం అని భావిస్తే.. ఆ కార్డును ఐటీ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించాల్సిన అవసరం లేదు. మీ వద్ద కూడా ఉంచుకోవచ్చు. ఒకవేళ ఎలాంటి పనులు లేకపోతే దానిని క్లోజ్ చేయడమే ఉత్తమం. ఎందుకంటే.. తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి అది వెళ్తే చిక్కుల్లో పడాల్సి వస్తుంది.

చనిపోయిన వారి పాన్‌కార్డును ఎలా రద్దు చేయించాలి..
మణించిన వ్యక్తుల పాన్ కార్డ్ అకౌంట్‌ను క్లోజ్ చేయాలనుకుంటే.. వారికి సంబంధించిన వారసుడు ఐటీ శాఖకు చెందిన అసెస్సింగ్ అధికారికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులో తప్పనిసరిగా.. మరణించిన వ్యక్తి పేరు, పాన్ కార్డ్ నెంబర్, పుట్టిన తేదీ, మరణ ధృవీకరణ పత్రాన్ని జతపరచాలి.

చనిపోయిన వ్యక్తి ఆధార్‌ కార్డ్‌ను ఏం చేయాలి?
చిరునామా ధృవీకరణగా ఆధార్ కార్డును వినియోగిస్తున్నారు. అయితే, ప్రస్తుతం చిరునామాకు మాత్రమే కాకుండా.. ప్రతీ పనికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి అయ్యింది. సిమ్ కార్డు తీసుకోవాలన్నా.. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ పథకం ప్రయోజనాన్ని పొందాలన్నా, ఎల్పీజీ సబ్సిడీ వంటి ఇతర పథకాల ప్రయోజనాలు పొందాలన్నా ఆధార్ తప్పనిసరి. అయితే, వ్యక్తి మరణించిన తరువాత ఆధార్ కార్డును క్లోజ్ చేయడానికి ఇప్పటి వరకు ఎలాంటి అవకాశం లేదు. ఆధార్ అనేది ఒక విశిష్ట సంఖ్య. ఒకరి నెంబర్ ఒకరికి మాత్రమే పరిమితం, మరెవ్వరికీ అలాంటి నెంబర్ ఉండదు. అందుకని ఈ ఆధార్ కార్డును చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. పాన్ కార్డును డిపాజిట్ చేయొచ్చు కానీ, ఆధార్‌కు ఆ అవకాశం లేనందు.. మరిణించిన వారి ఆధార్‌ను జాగ్రత్తగా భద్రపరచుకోవాలి.

Also read:

Allu Aravind: తనయుడితో కలిసి ఆర్ట్ గ్యాలరీలో సందడి చేసిన అల్లు అరవింద్.. ఫోటో వైరల్..

Covid Deaths: కోవిడ్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎందరిని బలితీసుకుందో తెలుసా..?

Central Government: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలెర్ట్.. ఈ నెల 8 నుంచి అమల్లోకి ఆ రూల్.!