
అభిమానులు సినిమా హీరోలు, రాజకీయ నాయకుల పుట్టినరోజు వేడుకలను అభిమానులు, కార్యకర్తలు ఎంతో అటహాసంగా నిర్వహిస్తారు. భారీ కేకులు కట్ చేసి, ఊరేగింపులు, ర్యాలీలు, తీన్మార్లు నృత్యాలతో టాప్ లేవగొడతారు. మరికొందరైతే అనాధ శరణాలయంలో వృద్ధులకు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పళ్ళు ఫలహారాలు అందిస్తారు. ఇప్పుడెందుకు పుట్టినరోజు వేడుకల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా… ఓ వ్యక్తి తను అభిమానించే ఓ హీరోయిన్ పుట్టినరోజు వేడుకలు భిన్నంగా చేయడం ఇప్పుడు ఆ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. అంతేకాక అయోధ్య బాల రామునిహీరోయిన్ ప్రతిష్ట వేళ ఊరు, వాడ, పట్టణం అనే తేడా లేకుండా యావత్ హిందూ ప్రపంచం భక్తి తన్మయత్వంలో మునిగిపోయిన వేళ వాటన్నింటికీ భిన్నంగా శ్రీరాముని బంటుగా పిలిచే ఆంజనేయుడి అంశగా పిలవబడే ఆ వానరాల ఆకలి తీర్చాడు ఆ అభిమాని..
ఆకలితో అలమటించే వానరాల కడుపు నింపి ఆ శ్రీరాముని బంటైన ఆంజనేయుడు ఆశీస్సులు పొందాడంటూ పలువురు ప్రశంశలతో ముంచెత్తుతున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన బవిరి శెట్టి మురళీకృష్ణ సినీ హీరో కృష్ణకి వీరాభిమాని. అంతేకాక ఆయన కృష్ణ మహేష్ బాబు యువసేన అధ్యక్షులు. హీరో కృష్ణ కుటుంబంలో పుట్టినరోజు వచ్చిన మురళీకృష్ణ జంగారెడ్డిగూడెంలో పెద్ద ఎత్తున పండుగలా నిర్వహిస్తారు. ఆయన జంగారెడ్డిగూడెంలో ఫ్రూట్ జ్యూస్ స్టాల్ వ్యాపారం చేస్తూ జ్యూస్ స్టాల్ ఎక్కడ చూసినా కృష్ణ మహేష్ బాబు ఆయన సతీమణి నమ్రత ఫోటోలే మనకు కనిపిస్తాయి.
అయితే అయోధ్య బాల రాముని ప్రతిష్ట రోజునే మురళీకృష్ణ ఎంతోగానే అభిమానించే హీరో మహేష్ బాబు సతీమణి ప్రముఖ హీరోయిన్ నమ్రత శిరోత్కర్ పుట్టినరోజు వచ్చింది. దాంతో ప్రతి సంవత్సరం లాగానే జంగారెడ్డిగూడెం ప్రాంత ఆసుపత్రిలో రోగులకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.. మరోపక్క అయోధ్య బాల రాముని కృప పొందే విధంగా ఆంజనేయుడిగా కొలవబడే వానరాలకు ఆహారం అందించాలనుకున్నారు. ఈ క్రమంలో ద్వారకాతిరుమల మండలం జి కొత్తపల్లి అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న సుమారు రెండువేలపైగా వానరాలకు ఆహార అందించారు. తంగేడు గింజలు, మరమరాలు, అరటి పళ్ళు, వేరుశనగ గుళ్ళు వాటికి ప్రేమగా తినిపించారు. తన అభిమాన హీరోయిన్ పుట్టినరోజు రోజున మూగజీవాల కడుపు నింపడం ఎంతో ఆనందంగా ఉందని, అంతేకాక అయోధ్యలో బాల రాముని దర్శించుకున్నంత పుణ్యం మాకు దక్కింది అనేంతగా సంబరపడుతున్నామన్నారు. అదేవిధంగా పెళ్లి, పుట్టినరోజు వేడుకలు జరుపుకునే ప్రతి ఒక్కరు ఇక్కడ ఆకలితో అలమటిస్తున్న వానరాల కడుపు నింపితే బాగుంటుందని ఆయన కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..