
మృత్యువు ఎప్పుడు, ఎక్కడి నుంచి దూసుకొస్తుందో ఎవరూ ఊహించరు. ఆయుష్షు నిండాలే కానీ అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న వ్యక్తి కూడా ఉన్నపలంగా ఈ లోకాన్ని వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన షాక్‌కి గురి చేస్తోంది. మృత్యువు దూసుకొస్తే ఇలా ఉంటుందా.? అనేంతలా భయపెడుతోందా వీడియో ఇంతకీ అంతలా ఆ వీడియోలో ఏముందనేగా మీ సందేహం అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఢిల్లీలోని కరోల్బాగ్‌లో ఓ యువకుడు ఆరుబయట బైక్‌పై కూర్చొని స్నేహితుడితో సరదాగా మాట్లాడుతున్నాడు. ఇదరు పక్కపక్కనే నిల్చొని ఏదో విషయమై మాట్లాడుకున్నారు. అయితే అంతలోనే ఉన్నట్లుండి మూడు అంతస్తు నుంచి ఏసీ పడింది. దీంతో 19 ఏళ్ల ఆ యువకుడి తలపై ఏసీ ఒక్కసారిగా పడింది. దీంతో బైక్‌పై కూర్చుకున్న యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పక్కనే ఉన్న యువకుడికి గాయాలయ్యాయి. యువకుడిని హుటాహుటినా ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ఇదంతా అక్కడే ఉన్న ఓ సీసీటీవీలో రికార్డైంది. దీంతో ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మృత్యువు ఇలా కూడా వస్తుందా.? అని ఈ వీడియో చూసిన నెటిజన్లు భయపడుతున్నారు. ఆయుష్షు నిండితే తాడు కూడా పాము అవుతుందని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఉదాహరణ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..