Trending Video: ఇంటర్నెట్ ను షేక్ చేస్తోన్న బంగీ జంప్ వీడియో.. చేయడానికే కాదు.. చూడడానికీ గట్స్ ఉండాల్సిందే..

|

Jan 30, 2023 | 5:58 PM

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే కారణంతో కొందరు ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతున్నారు. ఇంటర్నెట్ లో ట్రెండ్ అవడం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. సోషల్ మీడియా వినియోగం అధికంగా...

Trending Video: ఇంటర్నెట్ ను షేక్ చేస్తోన్న బంగీ జంప్ వీడియో.. చేయడానికే కాదు.. చూడడానికీ గట్స్ ఉండాల్సిందే..
Bungee Jump
Follow us on

సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే కారణంతో కొందరు ప్రమాదకర విన్యాసాలకు పాల్పడుతున్నారు. ఇంటర్నెట్ లో ట్రెండ్ అవడం కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు. సోషల్ మీడియా వినియోగం అధికంగా పెరిగిపోవడం, తక్కువ సమయంలో ఎక్కువ మందికి రీచ్ అవడం వంటి కారణాలతో ప్రజలు వాటిని చూసేందుకు, అందులో ఫేమస్ అయ్యేందుకు ఎలాంటి సాహసం చేసేందుకైనా వెనుకాడటం లేదు. మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే.. బంగీ జంపింగ్‌కి సంబంధించిన చాలా వీడియోలను చూసి ఉంటారు. ఇది పిల్లల ఆట కాదు. దీనికి చాలా ధైర్యం ఉండాలి. కొంతమంది తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ బంగీ జంప్ చేస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి బంగీ జంప్ చేయడాన్ని చూడవచ్చు. అడవిలో అన్ని జాగ్రత్తల మధ్య బంగీ జంప్ చేయాలనుకున్న వ్యక్తిని కట్టారు. కొంత సమయానికి అతనిని కిందికి వదిలేశారు. కేబుల్ క్లిప్ నుండి వ్యక్తి విడిపోయిన వెంటనే.. అతను నేరుగా వందల అడుగుల లోయలో పడిపోవడం చూడవచ్చు. అతను కింద పడే వేగం చూస్తే.. గుండె ఆగిపోతుందేమోననే ఫీలింగ్ కలుగుతుంది. ఆ వ్యక్తి స్థానంలో ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో ఊహించుకుంటేనే వణుకు పుడితోంది కదూ..

ఇవి కూడా చదవండి

బంగీ జంప్ కు సంబంధించిన ఈ వీడియో.. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. వార్త రాసే వరకు వీడియోకు దాదాపు 5 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..