Viral Video: సివంగితో మామూలుగా ఉండదు మరి.. అడవికి రాజైనా తోక ముడవాల్సిందే.. వీడియో వైరల్

అడవికి రాజు సింహం. అది ఎదురుగా వస్తుందంటే మిగతా జంతువులన్నీ సైడ్ ఇవ్వాల్సిందే. అట్లుంటది మరి సింగం తోని. సింహానికి ఉన్న విలక్షణమైన అలవాట్లు, వేటాడే తీరు, భారీ కాయం, రాజసం ఇవన్నీ కలగలిపి దీనిని స్పెషల్ గా..

Viral Video: సివంగితో మామూలుగా ఉండదు మరి.. అడవికి రాజైనా తోక ముడవాల్సిందే.. వీడియో వైరల్
Lion Attack Video

Updated on: Sep 15, 2022 | 12:08 PM

అడవికి రాజు సింహం. అది ఎదురుగా వస్తుందంటే మిగతా జంతువులన్నీ సైడ్ ఇవ్వాల్సిందే. అట్లుంటది మరి సింగం తోని. సింహానికి ఉన్న విలక్షణమైన అలవాట్లు, వేటాడే తీరు, భారీ కాయం, రాజసం ఇవన్నీ కలగలిపి దీనిని స్పెషల్ గా మార్చాయి. సింహం పంజా విసిరి ఎట్టాక్ చేస్తే ఎంతటి వారికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. మరోవైపు.. భార్యాభర్తల మధ్య ఎన్నో ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటాయి. పెళ్లయ్యాక భార్యకు భర్త భయపడాల్సిందే అని చెప్పే మీమ్స్ కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఇది మనుషులకే కాకుండా జంతువులు, క్రూర మృగాలకు కూడా వర్తిస్తుందనే విషయాన్ని కొన్ని వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది. వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఆడ సింహం ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఓ మగ సింహం వస్తుంది. నిద్రపోతున్న సింహాన్ని భయపెట్టాలనుకుని అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా వస్తుంది. కొంచెం కూడా సౌండ్ రానీయకుండా పక్కా ప్లాన్ తో వెళ్తుంది. నిద్రిస్తున్న సింహాన్ని లేపేందుకు ప్రయత్నిస్తుంది. దీని తీరుతో విసిగిపోయిన ఆడ సింహం వెంటనే లేచి గట్టిగా గర్జిస్తూ ఎట్టాక్ చేస్తుంది. ఊహించని ఈ హఠాత్పరిణామానికి మగ సింహం వెనక్కు తగ్గక తప్పలేదు.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ అయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు చాలా బాగా లైక్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 1.41 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సంఖ్య పెరగడమే కాకుండా బంధువులు, స్నేహితులకు షేర్ చేస్తున్నారు. అంతే కాకుండా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సింహం అయినా, మనిషి అయినా భార్య అంటే అందరికీ భయం అని  వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి