Telugu News Trending A video of people running in fear after seeing a crocodile in the midst of the population has gone viral on social media Telugu News
భూమిపై జీవిస్తున్న జంతువుల్లో మొసలి (Crocodile) అత్యంత ప్రమాదకరమైనదనే విషయం మనకు తెలిసిందే. అది భూమి మీద కంటే నీళ్లలో ఉన్నప్పుడే ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. అది నీళ్లలో ఉన్నప్పుడు ఎంతటి బలమైన జంతువునైనా...
భూమిపై జీవిస్తున్న జంతువుల్లో మొసలి (Crocodile) అత్యంత ప్రమాదకరమైనదనే విషయం మనకు తెలిసిందే. అది భూమి మీద కంటే నీళ్లలో ఉన్నప్పుడే ఎక్కువ శక్తిని కలిగి ఉంటుంది. అది నీళ్లలో ఉన్నప్పుడు ఎంతటి బలమైన జంతువునైనా అది సులభంగా హాంఫట్ అనిపించేస్తుంది. నీటిలో ముసలి నోటికి చిక్కితే ఇక ప్రాణాలతో బయటపడటం అసాధ్యంగానే చెప్పవచ్చు. నీళ్లలో ఉన్న మొసలి జోలికి పొరబాటును ఏ జంతువైనా వెళ్లిందో దాని ఆయుష్షు మూడినట్టే. అంతటి భయంకరమైన మొసలి జనావాసాల్లో ప్రత్యక్షమైతే.. అదీ ఇళ్లమధ్య.. వామ్మో అనిపిస్తుంది కదూ..నిజమేనండోయ్.. సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. ఉత్తరప్రదేశ్‌లో (Uttra Pradesh) ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. వరదలు ఉప్పొంగిపోయాయి. లోతట్టు ప్రాంతాలను వరద ప్రవాహం ముంచెత్తింది. భారీ వర్షాలు, నీటి ప్రవాహానికి శివకుటి గ్రామంలోని నివాస ప్రాంతంలోకి మొసలి కొట్టుకొచ్చింది. పాతబస్టాండ్ సమీపంలోని ఓ కాలనీలో ఈ మొసలి ప్రత్యక్షమైంది. ఇళ్లమధ్యలో అంత పెద్ద మొసలిని చూసి స్థానికులు హడలిపోయారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న మాధవ్ నేషనల్ పార్క్‌కు చెందిన రెస్క్యూ టీమ్ మొసలిని బంధించేందుకు శతవిధాలా ప్రయత్నించింది. గంటలకు పైగా శ్రమపడిన తర్వాత మొసలిని పట్టుకున్నారు. మొసలిని జాగ్రత్తగా తాళ్లతో బంధించి, నేషనల్ పార్క్ ఆవరణలో ఉన్న సాంఖ్య సాగర్ సరస్సులో విడిచిపెట్టారు. ఈ వీడియోను ఓ జర్నలిస్ట్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.