
మనం ఆరోగ్యంగా ఉండేందుకు ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఎన్నో రకాల ఫుడ్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇడ్లీ, దోస, రైస్, కర్రీస్, ఫ్రైస్.. వెజ్, నాన్ వెజ్, స్నాక్స్, స్వీట్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. వీటిలో చాలా మంది ఇష్టంగా తినే పదార్థాల్లో పానీ పూరి ఒకటి. వీధి చివర ఉండే పానీపూరీ బండి వద్ద రద్దీ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. అయితే… ఏ వంటకాన్నైనా సరే.. ఒకే పద్ధతిలో చేయాలి. కానీ కొంతమంది మాత్రం డిఫరెంట్ గా ట్రై చేస్తుంటారు. గులాబ్ జామ్ పరోటా, క్యాడ్బరీ ఎగ్ ఆమ్లెట్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కుకింగ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పానీపూరి.. పేరు చెప్పగానే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ నోరూరుతుంది. పూరీలో దాల్, నీరు నింపి ఇవ్వగానే నోట్లో వేసుకుని గుటుక్కుమనిపిస్తుంటారు. ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో.. పానీపూరి తయారు చేయడాన్ని చూడవచ్చు. కానీ వాటిలో పానీ నింపకుండా ఐస్ క్రీమ్ నింపి ఇస్తున్నారు. వెనిలా ఫ్లేవర్ ఐస్‌క్రీమ్‌ను పూరీలో యాడ్ చేసి కస్టమర్లకు ఇస్తున్నారు. పానీపూరికి మంచి రుచి అందించేందుకు గానూ.. సిరప్ కూడా యాడ్ చేశాడు.
ఈ వీడియోను ఫేస్‌బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను 26 వేల మందికి పైగా లైక్ చేశారు. వీడియో చూసిన వారంతా షాపు యజమానిపై పైర్ అవుతున్నారు. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయని మండిపడుతున్నారు. తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..