Telugu News Trending A video of a young man being attacked by a bull has gone viral on social media Telugu news
Video Viral: బాగా అయ్యిందా.. ప్రశాంతంగా ఉన్నప్పుడు కెలికితే ఇలాగే ఉంటుంది.. నవ్వు తెప్పిస్తున్న వీడియో..
రకరకాల వీడియోలకు సోషల్ మీడియా (Social Media) మంచి ప్లాట్ ఫామ్. ఇక్కడ అన్ని రకాల వీడియోలు ఉంటాయి. వీటిలో ఆశ్చర్యపరిచేవి, సాధారణమైనవి, నవ్వు తెప్పించేవి చాలానే ఉంటాయి. ఇవి నెటిజన్లను ఎంతో..
రకరకాల వీడియోలకు సోషల్ మీడియా (Social Media) మంచి ప్లాట్ ఫామ్. ఇక్కడ అన్ని రకాల వీడియోలు ఉంటాయి. వీటిలో ఆశ్చర్యపరిచేవి, సాధారణమైనవి, నవ్వు తెప్పించేవి చాలానే ఉంటాయి. ఇవి నెటిజన్లను ఎంతో ఆకర్షిస్తాయి. అయితే వీటిలో ప్రత్యేకంగా జంతువులు చేసే విన్యాసాలు, స్టంట్స్ ను చూసేందుకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అర్థం లేకుండా ఎవరూ ఎవరినీ ఎప్పుడూ డిస్టర్బ్ చేయకూడదని అంటుంటారు. అది మనిషి అయినా, జంతువు అయినా ఒకటే. కానీ కొంత మంది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరు. అంతేకాకుండా కావాలనే అలాంటి పనులు చేస్తుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో (Video) అలాంటిదే ఒకటి కనిపించింది. వినోదం, ఫన్ కోసం జంతువులను ఆటపట్టించడం సహజమే. ఇది ఆనందాన్ని కలిగించినా కొన్ని సార్లు తీవ్ర భయంకరమైన పరిణామాలను చూడవలసి వస్తుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న క్లిప్ లో ఓ వ్యక్తి ఎద్దును అనవసరంగా ఆటపట్టించడాన్ని చూడవచ్చు. ఈ వీడియో కేవలం ఎనిమిది సెకన్లే అయినా కారణం లేకుండా ఎవరినీ డిస్టర్బ్ చేయకూడదనే విషయాన్ని మాత్రం కచ్చితంగా వివరిస్తుంది.
ఈ వీడియోలో మూసి ఉన్న గేటు వద్ద ఒక ఎద్దు నిలబడి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ సమయంలో ఒక వ్యక్తి ఎద్దు వెనుక భాగంపై చేతితో కొట్టాడు. దీంతో ఎద్దు బెదిరిపోయి కంట్రోల్ తప్పుతుంది. ఒక్కసారిగా అది వెనక కాళ్లతో అక్కడ నిలబడి ఉన్న వ్యక్తి ముఖంపై దాడి చేస్తుంది. దీంతో అతను కిందపడిపోతాడు. కాలితో తన్నిన తీరు చూస్తుంటే అతడికి తీవ్ర గాయాలు తగిలినట్లు అర్థమవుతోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ద్వారా ఈ వీడియో పోస్ట్ అయింది. ఇప్పటి వరకు ఈ క్లిప్ కు 1.20 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.