Viral Video: ఒంటికాలి కొంగే అనుకుంటే.. ఇది దాన్ని మించిపోయింది.. పక్షి తెలివికి నెటిజన్లు ఫిదా

| Edited By: Ravi Kiran

Jul 05, 2022 | 8:00 AM

కొంగ ఎంతో తెలివైనదనే విషయం మనందరికీ తెలిసిందే. ఒంటి కాలితో నిలబడి.. చేపలను ఆహారంగా తీసుకునే విషయాన్ని మనం ఎన్నో కథల ద్వారా తెలుసుకున్నాం. ఒడ్డున నిలబడి చేపల కోసం ఎదురుచూస్తూ.. వాటిపై దూకి వాటిని ఆహారంగా మార్చుకునే...

Viral Video: ఒంటికాలి కొంగే అనుకుంటే.. ఇది దాన్ని మించిపోయింది.. పక్షి తెలివికి నెటిజన్లు ఫిదా
Fish Hunting Video
Follow us on

కొంగ ఎంతో తెలివైనదనే విషయం మనందరికీ తెలిసిందే. ఒంటి కాలితో నిలబడి.. చేపలను ఆహారంగా తీసుకునే విషయాన్ని మనం ఎన్నో కథల ద్వారా తెలుసుకున్నాం. ఒడ్డున నిలబడి చేపల కోసం ఎదురుచూస్తూ.. వాటిపై దూకి వాటిని ఆహారంగా మార్చుకునే తీరును చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. ఇలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక కొంగ నది ఒడ్డున నిలబడి చేపలను ప్రలోభపెడుతుంది. ఆపై వాటిపై దాడి చేసి, వేటాడి గుటుక్కుమనిపిస్తుంది. హంటర్ బర్డ్ టెక్నిక్ చూసిన నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. ఒక కొంగ వేట కోసం నది ఒడ్డుకు వచ్చి ధాన్యాన్ని నదిలోకి విసురుతుంది. ఆహారాన్ని తినేందుకు కొన్ని చేపలు ఒడ్డుకు వస్తాయి. ఇలా రెండు మూడు సార్లు ప్రయత్నించిన తర్వాత కొంగ ఎట్టకేలకు ఓ చేపను హాం ఫట్ చేసేసింది.

ఈ వీడియో ట్విట్టర్‌లో ట్రెండింగ్ గా మారింది. కొంగ తెలివిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోకు 61 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎరను పట్టుకోవడంలో, ఆహారాన్ని వేటాడటంలో కొంగ తెలివిని మెచ్చుకోవాల్సిందేనని రాస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి