చెవిలో పురుగులు, చీమలు దూరడం సమస్యను మనలో చాలా మందే ఎదుర్కొని ఉంటారు. చెవిలో అది చేసే హంగామా అంతా ఇంతా కాదు. లోపలికి వెళ్లలేక, బయటకు రాలేక తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. ఈ బాధను అనుభవిస్తేనే గానీ తెలియదు. కానీ ఓ మహిళ చెవి రంధ్రంలో మాత్రం ఏం దూరిందో తెలిస్తే మీ ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. ఇంతకీ ఆమె చెవిలే ఏం దూరిందో తెలుసా.. పాము దూరిందండి బాబోయ్.. యువతి సమస్య విని డాక్టర్లే షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెంటనే అప్రమత్తమైన వైద్యుడు మెడికల్ టాంగ్స్ సహాయంతో పామును చెవి రంద్రం నుంచి బయటకు తీశాడు. పాము తల చెవి బయట ఉండగా దాని శరీరం చెవిలో ఇరుక్కుంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ అయింది. వీడియోను చూసే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వీడియోను పలువురు లైక్స్, కామెంట్స్ చేస్తున్నారు. క్లిప్ చూశాక వచ్చే అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో రాస్తున్నారు. కాగా, అయితే, వైరల్ అవుతున్న ఈ వీడియో వాస్తవికతను ‘టీవీ9 తెలుగు’ నిర్ధరించలేదు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.