
పెరుగుతున్న సాంకేతికత, అందుబాటులోకి వస్తున్న సౌకర్యాలు.. మానవులను సుఖ జీవనానికి అలవాటు పడేలా చేస్తున్నాయి. ఏ మాత్రం శారీరక శ్రమ అవసరం లేకుండా ఒక్క బటన్ నొక్కితే పనయిపోయే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. మిక్సీల నుంచి వాషింగ్ మెషిన్ ల వరకు, ఫ్యాన్ ల నుంచి ఏసీల వరకు ఇలా సమస్తం.. టెక్నాలజీ మయమైంది. ముఖ్యంగా పెద్ద పెద్ద భవనాలలో లిఫ్ట్ లు ఎంట్రీ ఇవ్వడంతో ప్రజలు వాటికి బాగా అలవాటు పడిపోయారు. మెట్లు ఎక్కే అవసరం లేకుండా లిఫ్ట్ లు, ఎస్కలేటర్ల సహాయంతో వెళ్లాల్సిన ఫ్లోర్ కు చేరుకుంటున్నారు. మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. ప్రతిచోటా లిఫ్ట్ అందుబాటులో ఉంది. ఏ ఫ్లోర్‌కి వెళ్లాలనే బటన్‌ను నొక్కితే చాలు క్షణాల్లో లిఫ్ట్ మిమ్మల్ని మీ గమ్యస్థానానికి చేరుస్తుంది. ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అంతే కాకుండా సమయాన్ని కూడా ఆదా చేస్తుంది. కానీ అప్పుడప్పుడు లిఫ్ట్ ల తోనూ ప్రమాదులు జరుగుతుంటాయి. మనం అప్రమత్తంగా లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లిఫ్ట్ యాక్సిడెంట్స్ కు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయి. ప్రస్తుతానికి కూడా అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో ఒక వ్యక్తి రెప్పపాటు కాలంలో ప్రాణాల నుంచి బయటపడ్డాడు. కొంచెం ఆలస్యం అయితే లిఫ్ లో ఇరుక్కుని అతని తల మొండెం వేరయ్యేది. కానీ అతని అప్రమత్తత కారణంగా ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వైరల అవుతున్న ఈ వీడియోలో లిఫ్ట్ ఓపెన్ అయిన వెంటనే.. ఓ వ్యక్తి అక్కడి నుంచి హడావిడిగా వెళ్లడాన్ని చూడవచ్చు. అదే సమయంలో మరో వ్యక్తి లిఫ్ట్ ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. అతను లిఫ్ట్ గేట్ వద్దకు చేరుకోగానే లిఫ్ట్ అకస్మాత్తుగా కిందికి వెళ్లిపోతుంది. దీంతో ఆ వ్యక్తి వెంటనే అప్రమత్తమై లిఫ్ట్ లో నుంచి బయటకు వస్తాడు. కానీ కొంచెం ఆలస్యం జరిగినా అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయేవేనని అర్థమవుతోంది.
ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో పోస్ట్ అయింది. కేవలం 19 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 5 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో రష్యాలోని క్రాస్నోడార్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డవ్వడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.