ఫస్ట్ క్లాస్ బాత్రూమ్‌ని ఉపయోగించడానికి అనుమతించలేదని ఓ ప్రయాణీకుడు విమాన సిబ్బందిపై దాడి చేశాడు. అమెరికన్ ఎయిర్‌లైన్ ఫ్లైట్ 377 లో మెక్సికోలోని శాన్ జోస్ డెల్ కాబో నుంచి లాస్ ఏంజిల్స్ కు వెళ్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనను ఓ ప్రయాణికుడు రికార్డు చేయడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలోని ప్రయాణీకులు, సిబ్బంది ఆ యువకుడిని పట్టుకున్నారు. విమానం లాస్ ఏంజిల్స్‌లో ల్యాండ్ అయిన తర్వాత అతనిని అరెస్టు చేశారు. విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి.. వాష్ రూమ్ కు వెళ్లాలని అక్కడ ఉన్న సిబ్బందిని అడిగాడు. అయితే ఫస్ట్ క్లాస్ బాత్రూమ్ ను వినియోగించకూడదని, మరొక వాష్ రూమ్ లోకి వెళ్లాలని సిబ్బంది చెప్పారు. అతని సమాధానంతో ప్రయాణికుడికి కోపం వచ్చింది. సిబ్బంది తల భాగంలో కొట్టాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు రికార్ట్ చేశారు. అనంతరం వీడియోను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వెంటనే వైరల్ గా మారింది.
వైరల్ గా మారిన ఈ క్లిప్ లో ఓ వ్యక్తి విమాన సిబ్బంది వద్దకు వెళ్లడాన్ని చూడవచ్చు. అనంతరం ఆ వ్యక్తి అతనిపై దాడి చేశాడు. క్యాబిన్ సిబ్బందిని కొట్టిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. తర్వాత ఏమీ ఎరగనట్లు తన సీట్లోకి వెళ్లి కూర్చుంటాడు. విమానంలోని ఫస్ట్‌క్లాస్ క్యాబిన్‌లోని రెస్ట్‌రూమ్‌ని ఉపయోగించకూడదని చెప్పడం పట్ల ప్రయాణీకుడు కోపంగా ఉన్నాడని తోటి ప్రయాణీకులు చెబుతున్నారు. ఘటన జరిగినప్పటికీ.. విమానంలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Violence in the air: a friend was travelling from Cabo to LAX, when a passenger hit a flight attendant for not letting use him the first class bathroom. He was later restrained by other passengers and arrested upon touchdown. The video shot was by Barrie Livingstone pic.twitter.com/PntVqWyWs9
— Saad Mohseni (@saadmohseni) September 22, 2022
ఈ హింసాత్మక ప్రవర్తన ప్రయాణికులు, సిబ్బంది అందరి భద్రతను ప్రమాదంలో పడేస్తుంది విమానయాన సంస్థ ప్రతినిధి కర్టిస్ బ్లెస్సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఆ వ్యక్తి ఇంకెప్పుడూ అమెరికన్ ఎయిర్‌లైన్‌లో ప్రయాణించకుండా నిషేధం విధించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..