Andhra Pradesh: వామ్మో..! ఈ కొండ చిలువ చూశారా.. రొడ్డంత పొడవు ఉంది..

|

Apr 19, 2022 | 1:02 PM

AP News: కొంతమంది చిన్న పామును చూస్తేనే.. ఆమడదూరం పరిగెడతారు. అలాంటి పెద్ద పైథాన్ నడిరోడ్డపై కనిపిస్తే.. పై ప్రాణాలు పైనే పోతాయి.

Andhra Pradesh: వామ్మో..! ఈ కొండ చిలువ చూశారా.. రొడ్డంత పొడవు ఉంది..
Python Crossing Road
Follow us on

Viral Video: మనుషులు అడవులను ధ్వంసం చేస్తుంటే.. ఆ అడ‌విలోని జంతువులు, జీవులు రోడ్ల‌పైకి వ‌స్తున్నాయి. ఈ మ‌ధ్య ఇలాంటి సీన్లు చాలా కామ‌న్ అయిపోయాయి. అవి..  ఆహారం కోసం, ఎండాకాలంలో నీటి కోసం కోసం దారితప్పి మానవ ఆవాసాల్లోకి ప్రవేశిస్తుంటాయి. అడవికి దగ్గరగా ఉన్న ప్రదేశాలలోని రోడ్లపై  జంతువులు, పాములు రోడ్డును దాటుతూ ఒకవైపు నుంచి మరొవైపుకు వెళ్లిన సంఘటనలు కొకొల్లలు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari district) ఆకివీడు(Akividu)లో రోడ్డు దాటుతున్న సమయంలో ఓ కొండ చిలువ ట్రాఫిక్‌ను అడ్డుకుంది. బైపాస్ రోడ్డులో ఈ సంఘటన జరిగింది. దాదాపు 2 నిమిషాల పాటు దాదాపు 14 అడుగుల పొడవున్న కొండ చిలువ రోడ్డు మీద అలా నెమ్మదిగా పాకుకుంటూ పొలాల్లోకి వెళ్లిపోయింది. వేగంగా వచ్చిన వాహనదారులు.. వాహనాలను దూరంగా నిలిపేసి ఆ కొండ చిలువను ఆశ్చర్యంగా చూశారు. ఆ పామును ఎవరూ ఏమీ చేయలేదు. మరికొందరు దూరం నుంచి సెల్ఫీలు, వీడియోలు తీశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘పైథాన్ ఎంత కూల్‌గా పాకుకుంటూ వెళ్తుంది.., ‘దానికి..  ఆపద కల్గించనందుకు ధన్యవాదాలు..’, అంటూ కామెంట్లు పెడుతున్నారు.

వీడియో దిగువన చూడండి…

 

Also Read: Viral Photo: ఆమె కళ్లలోనే ఏదో నిషా ఉంది.. ఈ అమ్మ కూచి ఎవరో గుర్తుపట్టారా..?