పంజాబ్‌లోని ముక్త్‌సర్ జిల్లాలో ఓ యువకుడిని ట్రక్కు బానెట్‌కు కట్టేసి నగరమంతా ఊరేగించారు. కదులుతున్న ట్రక్కు నుంచి రెండు గోధుమల బస్తాలను దొంగిలించడమే ఆ యువకుడు చేసిన పాపం. దీనికి శిక్షగా ఆ యువకుడిని ట్రక్కు బానెట్‌కు కట్టి నగరమంతా ఊరేగించారు. ఆపై పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది . ఈ వీడియోలో ట్రక్ డ్రైవర్, హెల్పర్ యువకుడిని ట్రక్కు బానెట్‌కు కట్టి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళుతుండడం చూడవచ్చు. ఈ అమానవీయ సంఘటన ఆదివారం సాయంత్రం అబోహర్ రోడ్డులో జరిగింది. పోలీసుల సమాచారం ప్రకారం.. యువకుడు కదులుతున్న ట్రక్కు నుండి గోధుమ బస్తాలను దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. అయితే ట్రక్ డ్రైవర్ అతడిని పోలీసులకు అప్పగించకుండా ముందుగా ట్రక్కు బానెట్‌కు కట్టేసి ఊరంతా ఊరేగించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పంజాబ్ పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.
వైరలవుతోన్న ఈ వీడియోలో యువకుడిని ట్రక్కు బానెట్‌కు కట్టేసి ఉండగా, డ్రైవర్ సహాయకుడు అతడిని పట్టుకున్నట్లు వైరల్ క్లిప్‌లో చూడవచ్చు. అలాగే యువకుడు రెండు గోధుమల బస్తాలను దొంగిలించాడని, అందుకే అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నట్లు హెల్పర్ చెప్పడం వినవచ్చు. వైరల్ వీడియో ఆధారంగా ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్నామని పంజాబ్ పోలీస్ డీఎస్పీ జగదీష్ కుమార్ తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉంటే ఈ వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ‘పంజాబ్‌లో తాలిబాన్లు ఉన్నారా? ఏంటి? ఇంత దారుణంగా శిక్షలు వేస్తున్నారు’ అని నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Taliban-style punishment has now started in Punjab!
See.. In Muktsar, a young man is being tied in front of a truck and taken to the police station for stealing two gunny bags.#Punjab #Muktsar pic.twitter.com/q9WgIwO9A2
— #जयश्रीराधे ?? (@gayatrigkhurana) December 11, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..