Viral News: చిన్న పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సందర్భాల్లో వాళ్లు తెలిసో తెలియకో చేసే పనులు తీవ్ర సమస్యలకు దారి తీస్తాయి. సన్నటి గోడ మధ్యకు వెళ్లి ఇరుక్కుపోవడం, బిందెలో తలపెట్టడం ఇలాంటి సంఘటనలు మనం చాలా చూసే ఉంటాయి. అయితే చిన్నారులు తాము చేసే పనులతో తమకే కాకుండా పక్కవారికి కూడా ఇబ్బందులు తెచ్చి పెడుతుంటారు. తాజాగా చైనాలో జరిగిన ఓ సంఘటనే దీనికి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పవచ్చు.
ఇంతకీ ఏమైందంటే.. చైనాలో ఓ నాలుగేళ్ల కుర్రాడికి పేరెంట్స్ ఇటీవల కొత్త సైకిల్ కొనిచ్చారు. అయితే ఆ సైకిల్‌కు రౌండ్ లాక్ ఉంది. సాధారణంగా కీ తో కాకుండా నెంబర్లతో అన్‌లాక్ చేసే విధానంతో ఉందా లాక్. అయితే ఆ కుర్రాడు సైకిల్ నుంచి ఆ లాక్‌ను బయటకు తీసి ఆడుకున్నాడు. ఈ క్రమంలో ఆడుతూ.. ఆడుతూ ఆ రౌండ్ లాక్‌ను తన తల్లి మెడకు వేసి లాక్ చేసేశాడు. అయితే వెంటనే స్పందించిన ఆమె లాక్‌ను తీయడానికి నెంబర్‌తో ప్రయత్నించింది. కానీ ఆ కుర్రాడు లాక్‌ను మార్చేశాడు. దీంతో ఒక్కసారిగా ఆందోళన చెందిన ఆమె.. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు చేరకుంది.
లాక్‌ను విప్పడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో కొందరు నిపుణులను పిలిపించి అత్యంత జాగ్రత్తగా కట్టర్ సహాయంతో లాక్‌ను కత్తిరించి లాక్‌ను తొలగించారు. లాక్‌ను తొలగిస్తున్న సమయంలో కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చూశారుగా ఏ మాత్రం అజాగ్రత్తతో ఉన్నా ఎంత పెద్ద ప్రమాదం జరిగే అవకాశముందో, కాబట్టి మీ చిన్నారులపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచండి సుమా.!
Manchu Vishnu: ‘MAA’ లో కొనసాగుతున్న చిటపటలు.. కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు ఏం చేయబోతున్నారు?