Painful Vacation: టాయ్‌లెట్‌కి వెళ్లిన పర్యాటకుడిపై కాలనాగు దాడి.. కాటు ఎక్కడ వేసిందంటే..?

|

Nov 16, 2021 | 8:56 PM

Cobra Snake Bitten Genital Area: ఓ వ్యక్తి ఎంజాయ్ చేసేందుకు విహారయాత్రకు వెళ్లాడు. ఈ క్రమంలో అతనికి ఊహించని పరిణామం ఎదురైంది. టాయ్‌లెట్‌కి

Painful Vacation: టాయ్‌లెట్‌కి వెళ్లిన పర్యాటకుడిపై కాలనాగు దాడి.. కాటు ఎక్కడ వేసిందంటే..?
Cobra Snake
Follow us on

Cobra Snake Bitten Genital Area: ఓ వ్యక్తి ఎంజాయ్ చేసేందుకు విహారయాత్రకు వెళ్లాడు. ఈ క్రమంలో అతనికి ఊహించని పరిణామం ఎదురైంది. టాయ్‌లెట్‌కి వెళ్లిన ఆ వ్యక్తిపై పాము దాడి చేసింది. అతని ప్రైవేట్ భాగాలపై కాటేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో చోటుచేసుకుంది. యూరాలజీ కేస్ రిపోర్ట్స్ కథనం ప్రకారం.. 47 ఏళ్ల ఓ వ్యక్తి దక్షిణాఫ్రికాలో విహారయాత్ర కోసం వెళ్లాడు. ఈ క్రమంలో టాయిలెట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు.. అంతకుముందు బేసిన్‌లో ఉన్న పాము.. ప్రైవేట్ భాగాలపై కాటేసింది. టాయిలెట్ బౌల్‌లో అప్పటికే ఉన్న నాగుపాము.. అతనిపై ఒక్కసారిగా దాడి చేసినట్లు వెల్లడించింది. దీంతో అతను స్క్రోటల్ నెక్రోసిస్‌తో బాధపడ్డాడని అధ్యయనం తెలిపింది. ఇది తీవ్రమైన నెక్రోటిక్ ఇన్ఫెక్షన్ అని పేర్కొంది. పాము నేరుగా పురుషాంగం మీద కాటేసినట్లు జర్నల్‌లో ప్రచురించారు.

బాధితుడు కాటుకు గురైన అనంతరం జననాంగంలో మంట, నొప్పి, వాంతులతో బాధపడ్డాడని అధ్యయని తెలిపింది. ఈ నొప్పి ఛాతీ, ఉదరం వరకు పెరిగిందని తెలిపింది. పాము కాటు అనంతరం ఆ వ్యక్తిని హెలికాప్టర్‌లో 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రామా సెంటర్‌కు తరలించడానికి.. మూడు గంటలపాటు వేచి ఉండాల్సి వచ్చినట్లు తెలిపింది. ఆసుపత్రికి చేరుకోగానే పురుషుని పురుషాంగం, స్క్రోటమ్ ఉబ్బి పోయిందని.. అధ్యయనంలో వెల్లడించారు. మెడికల్ జర్నల్ ప్రకారం.. అతను దక్షిణాఫ్రికాలో సర్జికల్ డీబ్రిడ్మెంట్, నెదర్లాండ్స్‌లో పెనైల్ షాఫ్ట్ డీబ్రిడ్మెంట్ వంటి వైద్యాన్ని తీసుకొని ప్రాణాలతో బయటపడినట్లు పేర్కొన్నారు.

అయితే.. ఈ చికిత్సకు పాము విష యాంటిసెరమ్, బ్రాడ్-స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్ ఇచ్చినట్లు తెలిపారు. అయితే.. కొన్ని సందర్భాల్లో సర్జికల్ డీబ్రిడ్మెంట్ మూత్రపిండ లేదా శ్వాసకోశ వైఫల్యానికి కారణమవుతుందని జర్నల్ వివరించింది.

అయితే ఇలాంటి కేసులు తరచూ వస్తున్న నేపథ్యంలో పలు దేశాలు సూచనలు కూడా చేస్తున్నాయి. పాములు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో ఎల్లప్పుడూ టాయిలెట్‌ను ఫ్లష్ చేసిన తర్వాత ఉపయోగించాలంటూ సూచిస్తున్నాయి.

Also Read:

Indian Customs Policy: విదేశాల నుంచి ఎంత బాంగారం తీసుకురావచ్చు.. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్ష తప్పదు..

Viral Video: ఇదెక్కడి సీన్ గురూ..! రిమోట్‌తో కంట్రోల్ చేస్తూ డ్రోన్‌ను ఎగరేస్తున్న చింపాంజీలు! వీడియో వైరల్