Viral News: మహారాష్ట్ర To మాంచెస్టర్.. ఖండాలు దాటిన పాత ఇనుప కుర్చీ.. దీని వెనుక పెద్ద కథే ఉందిగా..

|

Oct 01, 2021 | 12:10 PM

జీవితంలో ఏ వ్యక్తీ.. ఏ వస్తువూ పనికి రాదని భావించకూడదని చెబుతారు పెద్దలు. దీనికి ఉదాహరణగా.. పనిచేయని గడియారం కూడా రోజులో రెండుసార్లు కరెక్ట్ టైమ్‌ను చూపిస్తుందని ఉదాహరణగా చెబుతారు.

Viral News: మహారాష్ట్ర To మాంచెస్టర్.. ఖండాలు దాటిన పాత ఇనుప కుర్చీ.. దీని వెనుక పెద్ద కథే ఉందిగా..
Metal Chair
Follow us on

జీవితంలో ఏ వ్యక్తినీ.. ఏ వస్తువునీ పనికి రాదని భావించకూడదని చెబుతారు పెద్దలు. దీనికి ఉదాహరణగా.. పనిచేయని గడియారం కూడా రోజులో రెండుసార్లు కరెక్ట్ టైమ్‌ను చూపిస్తుందని చెబుతారు. ఇప్పుడు మనం అలాంటి మరో ఉదాహరణ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక పనికి రాదని భావించిన ఓ పాతకాలపు మడతపెట్టే ఇనుప కుర్చీ ఫోటో గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన పత్రికలు, టీవీ ఛానళ్లు, వెబ్‌సైట్స్ కూడా దీని గురించి ప్రత్యేక కథనాలు రాస్తున్నాయంటే దాని క్రేజ్ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ సోషల్ మీడియాలో తెగ పాపులర్ అయిపోయిన ఆ ఐరన్ కుర్చీ సంగతేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

బ్రిటన్‌లోని మాంచెస్టర్‌లో ఓ రెస్టారెంట్ దగ్గర పాతకాలపు ఇనుప కుర్చీ దర్శనమిచ్చింది. ఈ కుర్చీ వెనుక మరాఠీలో ‘బాలు లఖాండే, సావ్లాజ్’ అని రాసుంది. 1990లలో ప్లాస్టిక్ కుర్చీలు వాడుకలోకి రాకముందు ఇవి వినియోగంలో ఉండేవి. ఇప్పుడు ఇలాంటి కుర్చీలు దాదాపుగా ఎక్కడా కనిపించవు. దీన్ని మాంచెస్టర్‌లోని రెస్టారెంట్ దగ్గర చూసి ఆశ్చర్యానికి గురైన జర్నలిస్ట్ సునందన్ లెలే దాన్ని ఫోటోలు, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహారాష్ట్ర నుంచి మాంచెస్టర్‌కు 7000 కిలో మీటర్ల దూరం ఇది ఎలా ప్రయాణించిందో తనకు తెలియడం లేదంటూ కామెంట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఇనుప కుర్చీ మహారాష్ట్ర నుంచి మాంచెస్టర్‌కు ఎలా వెళ్లిందన్న విషయంపై సోషల్ మీడియా సాయంతో క్లారిటీ వచ్చేసింది. ఈ కుర్చీ మహారాష్ట్రలోని సావ్లాజ్‌కు చెందిన బాలు లఖాండే‌కు చెందిన షామియానా దుకాణదారుడిది. 15 ఏళ్లకు ముందు వరకు ఇలాంటి ఇనుపు చైర్లను ఆయన..వివాహాది కార్యక్రమాలకు బాడుగకు ఇచ్చేవారు. అయితే కస్టమర్లు ప్లాస్టిక్ కుర్చీలు కావాలని డిమాండ్ చేయడంతో క్రమంగా ఇనుప కుర్చీల వాడకం తగ్గిపోయింది. మార్కెట్ నుంచి ఇవి పూర్తిగా మాయమయ్యాయి. తమ దుకాణంలోని ఇనుప కుర్చీలను ఒక్కోటి రూ.10ల చొప్పున పాత ఇనుప సామన్ల కొనుగోలుదారుడికి విక్రయించి చేయి దులుపుకున్నట్లు బాలు లఖాండే మీడియాకు తెలిపారు.

ఆ తర్వాతే అందులోని ఓ ఇనుప కుర్చీ దశ తిరిగిపోయినట్లు తేల్చారు. మహారాష్ట్రలో పర్యటిస్తున్న ఓ బ్రిటన్‌కు చెందిన పర్యాటకుడికి ఇది తెగ నచ్చేసింది. పాత వస్తువల పట్ల మక్కువ చూపే ఆ పర్యాటకుడు దీన్ని కొనుగోలు చేసి తన వెంట బ్రిటన్‌కు తీసుకెళ్లాడు. ఆ రకంగా ఆ ఇనుప కుర్చీ ఇప్పుడు మాంచెస్టర్‌లోని ఓ రెస్టారెంట్ దగ్గరకు చేరినట్లు తేల్చారు. అలా మహారాష్ట్ర టు మాంచెస్టర్ వరకు ప్రయాణించిన ఈ పాత కుర్చీ కథ సోషల్ మీడియాలో నెటిజన్లను చాలా ఆకట్టుకుంటోంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న నానుడిని ఈ పాత కుర్చీ నిజం చేస్తోంది.

Also Read..

Gas Cylinder Price: మండుతోన్న బండ.. మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. వారికి మాత్రం ఊరట!

Tata-Air India: ఎయిర్ ఇండియాను దక్కించుకున్న టాటా సన్స్.. 68 సంవత్సరాల తరువాత మళ్లీ..