Viral Video: వామ్మో.. ఇలాంటి స్నేహితుడిని పెళ్లికి పిలిస్తే అంతే సంగతులు.. ఏం చేశాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..

|

Apr 23, 2022 | 6:59 PM

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకం. ఎంతో ఘనంగా.. బంధువులు, స్నేహితుల మధ్య జరుపుకోవాలని కోరుకుంటారు. అందుకు తగినట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటారు..

Viral Video: వామ్మో.. ఇలాంటి స్నేహితుడిని పెళ్లికి పిలిస్తే అంతే సంగతులు.. ఏం చేశాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..
Wedding Video
Follow us on

పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ప్రత్యేకం. ఎంతో ఘనంగా.. బంధువులు, స్నేహితుల మధ్య జరుపుకోవాలని కోరుకుంటారు. అందుకు తగినట్టుగానే ఏర్పాట్లు చేసుకుంటారు.. దూరంలో ఉన్న బంధువులను.. చిన్ననాటి స్నేహితులను.. ఆత్మీయులను అందరిని ఎంతో అభిమానంతో తమ పెళ్లికి రావాలని పిలుస్తుంటాయి. వివాహ వేడుకలో స్నేహితులు సరదాగా అల్లరి చేస్తుంటారు. కానీ కొన్నిసార్లు చిలిపిగా చేసే అల్లరి పనులు వధూవరులకు ఇబ్బందులు కలిగిస్తాయి. వాళ్ల సంతోష క్షణాలను కాస్త నిరాశకు గురయ్యేలా చేస్తాయి. ఇటీవల అలాంటి సంఘటనలు భారీగానే జరిగాయి. పెళ్లిల్లో స్నేహితులు, బంధువులు చేసే అల్లరి పనులు వధూవరులకు తలనొప్పిగా మారుతుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే.. ఇలాంటి స్నేహితులను అస్సలు పిలవద్దు రా బాబు అనుకుంటారు. ఇంతకీ అతను ఏం చేశాడు అని అనుకుంటున్నారా ?.. తెలియాలంటే వీడియో చూడాల్సిందే.

పెళ్లి తర్వాత వధూవరులు కేక్ కట్ చేయాలని ఎంతో సంతోషంగా కేక్ వద్దకు వచ్చి వెయిట్ చేస్తుంటారు. అక్కడే ఉన్న మరో వ్యక్తి వారిద్దరి మరో కేక్ ముక్కలను ప్లేట్స్ లలో వేసి అందిస్తుంటాడు.. అయితే అక్కడకు ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా వచ్చి.. వారి ముందున్న పెద్ద కేక్‏ను చేతులతో పట్టుకుని నాశనం చేసేశాడు.. అంతేకాదు.. ఆ కేకు ముక్కలను వధూవరుల ముఖాలకు రుద్దేందుకు తెగ ప్రయత్నించడంతో వారిద్దరూ అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నారు. అంతటితో ఊరుకోకుండా.. ఆ కేకును చిందరవందరగా చేస్తూ నేలపై పడేసాడు. ఈ ఘటన మొత్నాన్ని అక్కడే ఉన్న మరోవ్యక్తి రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Acharya Pre Release Event Live: ఆచార్య, సిద్ధూ వచ్చేస్తున్నారు.. కోలాహలంగా మారిన ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక..

Ram Charan: నీ నటన మైండ్ బ్లోయింగ్..కేజీఎఫ్ 2 అద్భుతం.. యశ్ పై చరణ్ ప్రశంసలు..

Siddarth Malhotra-Kiaraa Advani: బ్రేకప్ చెప్పేసుకున్న లవ్‏బర్డ్స్ ?.. ప్రియురాలితో విడిపోయిన బాలీవుడ్ స్టార్ హీరో..

Raveena tandon: స్టూడియోలో వాంతులు చేసుకున్న ప్రదేశాన్ని క్లీన్ చేశాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన కేజీఎఫ్ బ్యూటీ..