
ప్రస్తుతం ప్రజల్లో ఆన్‌లైన్ షాపింగ్‌పై నమ్మకం ఏర్పడింది. చిన్న చిన్న వస్తువుల నుంచి లక్షల రూపాయల విలువ చేసే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వరకు అన్నింటినీ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే రోజులు వచ్చేశాయ్. కస్టమర్ల నమ్మకానికి తగ్గట్లుగానే ఈ కామర్స్ సంస్థలు సైతం సరైన ప్రొడక్ట్స్‌ను అందిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని మరింత పెంచుతున్నాయి.
అయితే అడపాదడపా కొన్ని సంఘటనలు ఆన్‌లైన్ షాపింగ్‌పై అపనమ్మకాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఒక వస్తువును బుక్ చేస్తే మరో వస్తువు డెలివరీ కావడం, నకిలీ వస్తువులు రావడం వంటి సంఘటనలు చూసే ఉంటాం. దీంతో కస్టమర్స్ ప్రొడక్ట్స్‌ను ఓపెన్ చేసే సమయంలోనే వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ సంఘటనలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళితే.. రిపబ్లిక్ డే సేల్‌లో భాగంగా మధ్యప్రదేశ్‌కు చెందిన సౌరో ముఖర్జీ అనే వ్యక్తి ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్‌ను బుక్ చేశాడు. జనవరి 13వ తేదీన రూ. 1.13 లక్ష విలువైన ల్యాప్‌టాప్ బుక్ చేశాడు. జనవరి 14వ తేదీన పార్శిల్ డెలివరీ అయ్యింది. అయితే బాక్స్‌ను ఓపెన్ చేసి చూడగానే ముఖర్జీ ఒక్కసారిగా షాక్‌కి గురయ్యాడు. బాక్స్ ఓపెన్ చేయగానే పాత ల్యాప్‌టాప్ కనిపించింది. దీంతో దీనిని వీడియోను చిత్రీకరించిన ముఖర్జీ ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు.
I ordered a brand new Asus Laptop from Flipkart in this Republic Day sale and I received some old discarded laptop.
Never trust products ordered from online platforms. @flipkartsupport @Flipkart #flipkartscam pic.twitter.com/EMEBBhnh2V— Souro Mukherjee (Gutenberg) (@souro9737) January 14, 2024
ఈ విషయమై ముఖర్జీ ట్వీట్ చేస్తూ.. ‘రిపబ్లిక్ డే సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆసుస్ ల్యాప్‌టాప్‌ను ఆర్డర్ చేశాను. పాత ల్యాప్‌టాప్‌ను నాకు పంపించారు. ఆన్‌లైన్ వేదికల ద్వారా విక్రయించే వస్తువుల్ని నమ్మొద్దు’ అంటూ ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్‌సపోర్ట్ టీమ్‌కి ట్యాగ్ చేశాడు. దీంతో దీనిపై ఫ్లిప్‌కార్ట్ స్పందించింది. ‘ఇలా జరిగినందుకు మమ్మల్ని క్షమించండి. ఆర్డర్ వివరాలు తెలియజేస్తే మీకు సాయం చేస్తాం’ అంటూ ప్రకటన చేసింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..