Viral News: ఇదెక్కడి పిచ్చి బాబు.. కుక్క పళ్లను క్లీన్ చేయడానికి రూ. 4 లక్షలు చెల్లించాడు..

|

Sep 04, 2022 | 1:44 PM

రెడ్డిట్ వినియోగదారుడు తమ పెంపుడు కుక్క పళ్లను శుభ్రం చేయడానికి 5000 డాలర్లు.. అంటే అక్షరాల రూ. 3.9 లక్షలు చెల్లించినట్లు తెలిపాడు.

Viral News: ఇదెక్కడి పిచ్చి బాబు.. కుక్క పళ్లను క్లీన్ చేయడానికి రూ. 4 లక్షలు చెల్లించాడు..
Dog
Follow us on

సాధారణంగా పెంపుడు జంతువుల పట్ల ఎక్కువ ప్రేమను కలిగి ఉంటారు. ముఖ్యంగా శునకాలు, పిల్లుల పై అభిమానం అమితంగా ఉంటుంది. అయితే ఇంట్లో ఉండే పెంపుడు జంతువులపై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ వారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. వాటి ఆహారపు అలవాట్లు.. పరిశుభ్రత, ఇతర వైద్య అవసరాల పట్ల కూడా అలర్ట్ గా ఉండాలి. అయితే ఇప్పటివరకు తమ పెంపుడు శునకాలపై ప్రేమను పలు రకాలుగా చూపించిన వారిని చూసి ఉంటాం. కానీ కుక్క పళ్లను క్లీన్ చేయడానికి దాదాపు రూ. 4 లక్షలు చెల్లించినవారిని చూశారా ? . కానీ నిజమే. ఈ విషయాన్ని స్వయంగా సదరు యాజమాని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. రెడ్డిట్ వినియోగదారుడు తమ పెంపుడు కుక్క పళ్లను శుభ్రం చేయడానికి 5000 డాలర్లు.. అంటే అక్షరాల రూ. 3.9 లక్షలు చెల్లించినట్లు తెలిపాడు.

పెంపుడు కుక్కకు పళ్ల క్లీనింగ్ కోసం రూ. 4 లక్షలు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది.. అందుకు జరిగిన ప్రక్రియ గురించి పూర్తిగా ఓ నోట్ షేర్ చేశారు. తమ తెల్ల కుక్క పిల్లను మత్తులో ఉంచి దాని పళ్లను శుభ్రం చేశాడు. అయితే ఆ సమయంలో ఆ కుక్క పూర్తిగా రంగు కోల్పోయింది. దీంతో డాక్టర్ క్లీనింగ్ ప్రక్రియను మధ్యలోనే ఆపేశాడు. ఆ కుక్క ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి అనేక పరీక్షలు చేయించాల్సి వచ్చింది. రక్తపరీక్షలు.. గుండె పరీక్షలు చేయించాలని వైద్యులు తెలిపారు. దీంతో సమీపంలోని మరో వైద్యుడిని సంప్రదించగా.. కుక్క నోటికి ఎక్స్ – రే చేసి.. దాని పళ్లలో కొన్నింటిని తీసివేయాలని తెలిపారు. వాటికి క్యాన్సర్ ఉందా ? అనే విషయం నిర్ధారించుకోవడానికి బయాప్సీకి తీసుకువెళ్లాలని వైద్యుడు తెలిపారు. మొత్తం ప్రక్రియకు 5000 డాలర్లు ఖర్చవుతుందని చెప్పాడు. తన కుటుంబంలో పెంపుడు కుక్కలను ఎప్పుడూ వెట్‏కు తీసుకెళ్లలేదు. అదృష్టవశాత్తు తమ పెంపుడు కుక్క వైద్యానికి అవసరమైన నగదు తమ దగ్గర ఉందని.. మా కుక్కకు ఉత్తమమైనదాన్ని చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.