Viral Video: జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా చిన్న నాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరిచిపోలేము. ఒక్కసారిగా ఆ మధుర అనుభూతులను గుర్తు చేసుకుంటే ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే పెదవిపైకి చిరునవ్వు వచ్చేస్తోంది. తాజాగా నెట్టింట వైరల్ అవుతోన్న ఓ వీడియో అలాంటి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ అనుభూతులను స్మరించుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే.. కొంత మంది చిన్నారులు స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి వెళుతున్నారు. అదే సమయంలో వర్షం కురుస్తోంది. అయితే వారి దగ్గర కేవలం ఒకే గొడుగు ఉంది. అయితే ఉన్న ఓ ఒక్క గొడుగును అందరూ షేర్ చేసుకున్నారు. ఆ గొడుగు అందరికీ సరిపోదని తెలిసిసా.. గొడుగు కింద చేరి వెళుతున్నారు. దీనిని అక్కడే బైక్‌పై వెళ్తోన్న ఓ వ్యక్తి వీడియో తీశారు.
दोस्त.❤️ pic.twitter.com/JvbjRurKO5
— Awanish Sharan (@AwanishSharan) July 2, 2022
ఈ వీడియోను ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన అవనిష్ శరణ్ అనే ఐఏఎస్ అధికారి ట్వీట్ చేశారు. ‘దోస్త్’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. చిన్నారుల కల్మషంలేని నవ్వులు చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కేవలం కొన్ని గంటల్లోనే వేలల్లో లైక్‌ల వర్షం కురుస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..