AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: యువకుడిపై కుక్కల గుంపు దాడి.. కానీ, వాటితో కబడ్డీ ఆడేసుకున్నాడుగా.. వీడియో చూస్తే కళ్లు బైర్లే..

వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్నాడు.. కొంత దూరం వెళ్లగానే అతనికి సడన్ గా ఓ కుక్కల గుంపు ఎదురుపడింది. అవి అతన్ని చూడగానే ఎటాక్‌ చేయలనే కోపంతో

Viral Video: యువకుడిపై కుక్కల గుంపు దాడి.. కానీ, వాటితో కబడ్డీ ఆడేసుకున్నాడుగా.. వీడియో చూస్తే కళ్లు బైర్లే..
Dogs Sudden Attacked
Jyothi Gadda
|

Updated on: Jul 04, 2022 | 1:45 PM

Share

Viral Video today: సోషల్ మీడియాలో ప్రతినిత్యం అనేక రకాల రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని వీడియోలు మనకు నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని వీడియోలు షాక్ కు గురిచేస్తాయి. తాజాగా అలాంటి ఓ షాకింగ్ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ కుక్కల గుంపు రోడ్డుపై వెళ్తున్న వ్యక్తికి చుక్కలు చూపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వీడియోలో ఓ వ్యక్తి రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్నాడు.. కొంత దూరం వెళ్లగానే అతనికి సడన్ గా ఓ కుక్కల గుంపు ఎదురుపడింది. అవి అతన్ని చూడగానే ఎటాక్‌ చేయలనే కోపంతో అతన్ని చుట్టుముట్టాయి. ఒకటి కాదు, రెండు కాదు..దాదాపు 8 కుక్కలు అతని వెంటపడ్డాయి. అతడిపై దాడికి దిగాయి. కానీ, అతడు ఏమాత్రం భయపడలేదు.. క్షణాల్లోనే యువకుడు చాకచక్యంగా వ్యవహరించాడు..భయపడి పరిగెత్తకుండా వాటిని ధైర్యంగా ఎదిరించాడు. అదేదో కోపంతో కాకుండా తెలివిగా ఏదో గేమ్‌ ఆడుతున్నట్టుగానే వాటి ఆటకట్టించాడు. కాళ్లు, చేతులను చాలా వేగంగా కదుపుతూ వాటి నుంచి తప్పించుకున్నాడు. కాగా, సోషల్ మీడియాలో వీడియో వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అప్ లోడ్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్స్ వ్యూస్ సాధించింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. వీడియో చూసిన ప్రతిఒక్కరూ యువకుడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ ప్రశంసల కామెంట్లు కుమ్మరిస్తున్నారు. కుక్కల గుంపును అతడు అడ్డుకున్న విధానానికి నెటిజన్లు హాట్సాఫ్ చెబుతున్నారు. బ్రూస్ లీ అంటూ ఒకరు కామెంట్ చేస్తే… ఫైటర్ అంటూ మరొకరు కామెంట్ చేశారు