Viral Video: నిత్యవసర ధరలన్నీ భారీగా పెరుగుతున్నాయి. ఏ వస్తువు కొనాలన్నా ధరలు భగ్గుమంటున్నాయి. ఇక ఎండకాలం దాహం వేస్తుంది కదా అని కాస్త నిమ్మకాయ రసం చేసుకొని తాగుదాం అనుకుంటున్న వారికి నిమ్మకాయ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు పదుల కొద్ది నిమ్మకాయలు కొనుగోలు చేసేవారు ఇప్పుడు వాటి జోలికే వెళ్లడం లేదు. వీలైనంత వరకు నిమ్మకాయను అవైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే సమాజంలో జరిగే ప్రతీ అంశంపై తమదైన శైలిలో స్పందించే నెటిజన్లు నిమ్మకాయ ధరలపై కూడా సోషల్ మీడియాలో జోకులు పేల్చుతున్నారు.
రకరకాల మీమ్స్‌ను, ఫన్నీ వీడియోలను క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం నిమ్మకాయ ధరలకు సంబంధించిన అలాంటి వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా శశాంక్ అనే పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ ఐడీలో పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ఉద్దేశ పూర్వకంగా తీసిందే అయినప్పటికీ ప్రస్తుతం సమాజంలో ఉన్న పరిస్థితికి అద్దంపట్టేలా ఉండడంతో నెటిజన్లు తెగ కనెక్ట్ అవుతున్నారు.
ఇక ఆ వీడియోలో ఏముందనేగా.. ఓ వ్యక్తి శుభకార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన విందుకు వెళ్తాడు. అదే సమయంలో లంచ్ మెనులో అన్ని వంటకాలతో పాటు కట్ చేసిన నిమ్మకాయ ముక్కలను అక్కడ ఉంచారు. దీంతో నిమ్మకాయ ముక్కలను చూసిన ఆ వ్యక్తి వెంటనే చేతులో ఉన్న ప్లేట్‌ను పక్కన పడేసి చేతికి అందినకాడికి తీసుకొని జేబులో వేసుకొని వెళ్తాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వీడియో చూసిన కొందరు నెటిజన్లు.. ‘చాలా బాగుంది, ప్రస్తుతం పరిస్థితులు ఇలానే ఉన్నాయి’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
ఇలాంటి ఆసక్తికరమైన వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Archana Jois: వైరల్ అవుతున్న రాకీభాయ్ మదర్ ఫొటోస్.. కుర్రకారును కట్టిపడేస్తున్న అర్చన
Tamil Nadu: మదురైలో తీవ్ర విషాదం.. ట్యాంక్ లో విష వాయువులు వెలువడి ముగ్గురు కార్మికుల దుర్మరణం