Viral Video: వామ్మో..అందాల కోకిలకు ఇంత గుండె ధైర్యమా?.. పాముతో తలపడి..

|

Oct 02, 2024 | 4:11 PM

మనకు ఆ పదం వింటే ఒక్కసారిగా బాడీలో ఏందో తెలియని భయం వస్తుంది. దాన్ని ఒక్కసారి ఊహించుకుంటే నోటి నుంచి మాట బయటకు రాదు. ఇప్పటికే మీకు అది ఏంటో అర్దమై ఉంటుంది. అదే పాము.. దాన్ని చూసిన వెంటనే అది మనలను ఏదో విధంగా చంపేస్తుందో అని భయపడుతూ ఉంటాం..

Viral Video: వామ్మో..అందాల కోకిలకు ఇంత గుండె ధైర్యమా?.. పాముతో తలపడి..
Snake Cuckoo Fight
Follow us on

మనకు ఆ పదం వింటే ఒక్కసారిగా బాడీలో ఏందో తెలియని భయం వస్తుంది. దాన్ని ఒక్కసారి ఊహించుకుంటే నోటి నుంచి మాట బయటకు రాదు. ఇప్పటికే మీకు అది ఏంటో అర్దమై ఉంటుంది. అదే పాము.. దాన్ని చూసిన వెంటనే అది మనలను ఏదో విధంగా చంపేస్తుందో అని భయపడుతూ ఉంటాం..కొంత మంది పాము తనకు హాని చేయకపోయినా, ఆ పాముకి విషం లేకపోయినా, దాన్ని చంపేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. అందులో కోకిల పాము రెండు తలపడుతున్నాయి.

మనకు కోకిల అనగా మొదట గుర్తుకు వచ్చేది తన అందమైన స్వరం.. మనం నిత్య జీవితంలో ఓ మంచి వాయిస్‌‌ను వర్ణించడానికి కోకిలను వాడుతుంటాము.. అబ్బా.. ఆమె కొకిల లాగా మంచిగా పాటలు పాడుతుందని మాట్లాడుకుంటాం.. ఆ కొకిల చూడ్డానికి ఎలా ఉంటుంది. చిన్నగా ఉంటుంది. కానీ అది పాముతో ఫైట్ చేసిందంటే మీరు నమ్ముతారా..? నమ్మాలి కచ్చితంగా.. ఓ వీడియోలో కోకిల పరిగెత్తించి పరిగెత్తించి పాముతో తలపడింది. ఈ వీడియోపై నెటిజన్స్ రకరకలుగా స్పందిస్తున్నారు. వామ్మో..అందాల కోకిలకు ఇంత గుండె ధైర్యమా? అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరు నేచర్‌ని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ఎవరిని తక్కువ అంచనా వేయవద్దని ఎవరిలో ఎంత దమ్ము ఉందో వాళ్లకే తెలుస్తుందని పేర్కొంటున్నారు. కానీ ఈ వీడియో నుంచి మనం ఓ నీతిని మాత్రం నేర్చుకోవచ్చు.. ఎప్పుడు ఎవరిని తక్కువ అంచనా వేయవద్దని అర్థమవుతుంది.

పాము కోకిల తలపడుతున్న వీడియో..