వర్షాకాలం వచ్చేసింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలకు ఒకింత తిప్పలు తప్పవు. అలాగే ఇతర సీజన్‌లతో పోలిస్తే వర్షాకాలంలో వాతావరణం తీవ్రత కారణంగా క్రిమికీటకాదులు ఇళ్లలోకి వచ్చి చేరుతుంటాయి. తరచూ పాములు వంటి సరీసృపాలు కూడా ఇంట్లోకి రావడం చూస్తుంటాం. అప్పుడప్పుడు భారీ విషసర్పాలు కూడా ఇంట్లోకి ప్రవేశించి, బీరువాలు, ఫ్రిడ్జ్‌లు, పెంపుడు జంతువుల ఆవాసాల్లో దూరిపోతుంటాయి. గతంలో షులో దూరిన పాము వీడియో కూడా సోషల్ మీడియాలో కనిపించింది. తాజాగా అలాంటిదే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎక్కడ్నుంచి వచ్చిందో తెలియదు గానీ, ఒక నాగపాము పిల్ల బూట్లలో దూరి వెచ్చగా పడుకున్న ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను షాక్ అయ్యేలా చేసింది.
కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాకు చెందిన నందిత శివనాగౌడ్ ఇంట్లో నాగుపాము పిల్ల ప్రత్యక్షమైంది. పిల్ల నాగు ఒకటి..వారి ఇంట్లోకి ప్రవేశించి..చెప్పుల స్టాండులోని బూట్లలో దూరింది. హాయిగా వెచ్చగా నిద్రపోతోంది. ఈ క్రమంలోనే నందిత చెత్త ఊడుస్తుండగా ఆమె షూలో నాగుపాము పిల్ల కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అయ్యింది. వెంటనే ఈ విషయాన్ని స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నాగుపాము పిల్లను చాకచక్యంగా బంధించి సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. అనంతరం స్థానికులకు పాముల పట్ల అవగాహన కల్పించారు. నాగుపాము కాటేస్తే ఏమవుతుంది..? పాము కాటు నుండి తమను తాము ఎలా రక్షించుకోవాలో కూడా వివరించారు.
అంతేకాదు.. బూట్లు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని స్నేక్ క్యాచర్ సూచించాడు. షూలను వదిలే సమయంలో కూడా ఎలా వదిలేయాలో వివరించాడు. సాధారణంగా చెప్పులా వదిలేస్తే ఒక్కోసారి పాముల వంటివి, క్రిమి కీటకాలు అందులోకి చేరే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, షూలను జాగ్రత్తగా దులిపి చూసుకుని వేసుకోవాలని, కోబ్రాస్ నుంచి రక్షణ పొందేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..