అమ్మతో గొడవపడ్డ బాలుడు..అమ్మమ్మకు చెప్తానంటూ130 కి.మీ సైకిల్‌పై ప్రయాణం.. తర్వాత ఏం జరిగిందంటే

|

Apr 13, 2023 | 10:02 AM

చిన్న పిల్లలు అమ్మనాన్నలపై అలిగినప్పుడు ఇంట్లో ఉండే నానమ్మ, అమ్మమ్మ లేదా తాతయ్యల దగ్గరికి వెళ్తడం మాములే. కాని చైనాలో ఓ బాలుడు తన తల్లితో గొడవపడి ఆమెపై అమ్మమ్మకు ఫిర్యాదు చేయడనానికి ఏకంగా 130 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లాడు.

అమ్మతో గొడవపడ్డ బాలుడు..అమ్మమ్మకు చెప్తానంటూ130 కి.మీ సైకిల్‌పై ప్రయాణం.. తర్వాత ఏం జరిగిందంటే
Bicycle
Follow us on

చిన్న పిల్లలు అమ్మనాన్నలపై అలిగినప్పుడు ఇంట్లో ఉండే నానమ్మ, అమ్మమ్మ లేదా తాతయ్యల దగ్గరికి వెళ్తడం మాములే. కాని చైనాలో ఓ బాలుడు తన తల్లితో గొడవపడి ఆమెపై అమ్మమ్మకు ఫిర్యాదు చేయడనానికి ఏకంగా 130 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లాడు. వివరాల్లోకి వెళ్తే మీజింగ్‌లో ఉంటున్న 11 ఏళ్ల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అయితే తాజాగా ఏదో విషయంలో వాళ్లిద్దరికి గొడవ జరగింది. ఆ తల్లి తన కొడుకుని తిట్టింది. కోపంతో ఆ బాలుడు ఈ విషయం అంతా అమ్మమ్మకు చెప్తానని తల్లితో అన్నాడు. ఆమె కూడా పట్టించుకోలేదు. దీంతో ఆ బాలుడు జరిగిన విషయాన్నంతా అమ్మమ్మకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అయితే వాళ్ల అమ్మమ్మ ఇంటికీ చేరుకోవాలంటే దాదాపు గంట సమయం పడుతుంది.

ఈ సంఘటన సాయంత్రం పూట జరగడంతో ఆ సమయంలోనే ఆ బాలుడు సైకిల్‌పై అమ్మమ్మ ఇంటికి బయలుదేరాడు. రోడ్డుపై కనిపించే బోర్టులు చూసుకుంటూ ముందుకు సాగాడు. కాస్త దూరం వెళ్లాక తన వెళ్లాల్సిన దారిని మరిచిపోయాడు. అలా తొక్కుతూ తొక్కతూ దాదాపు 130 కిలోమీటర్ల దూరం వచ్చేశాడు. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ టన్నెల్ వద్ద స్పృహ తప్పి పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాలుడ్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. బాలుడ్ని విచారించగా జరిగిన విషయాన్ని తెలుసుకొని పోలీసులు షాకయ్యారు. ఆ తర్వాత పోలీస్ జీపులో అతడ్ని తన అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్లారు.అనంతరం ఈ విషయాన్ని అతని తల్లిదండ్రులకు కూడా చెప్పడంతో వాళ్లు వచ్చి తీసుకెళ్లారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ సంఘటన నెటీజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి