స్కూల్ బస్సులో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని డోర్‌ తెరిచి చూడగా.. ఉలిక్కిపడే దృశ్యం..

|

Oct 17, 2022 | 6:30 AM

పాఠశాలకు ఆదివారం సెలవు కావడంతో స్కూలు బస్సును డ్రైవర్‌ తన గ్రామానికి తీసుకెళ్లి ఇంటి దగ్గర పార్క్‌ చేశాడు. అయితే ఆ బస్సులోని నుంచి వింత శబ్ధాలు వస్తుండడంతో గ్రామస్థులు అలర్ట్ అయ్యారు. ఇంతకీ బస్సులో ఏముందా అని డోర్‌ తెరిచి చూడగా అక్కడ వారికి కనిపించిన దృశ్యం వారికి ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే..

స్కూల్ బస్సులో నుంచి వింత శబ్ధాలు.. ఏంటా అని డోర్‌ తెరిచి చూడగా.. ఉలిక్కిపడే దృశ్యం..
Representative Image
Follow us on

పాఠశాలకు ఆదివారం సెలవు కావడంతో స్కూలు బస్సును డ్రైవర్‌ తన గ్రామానికి తీసుకెళ్లి ఇంటి దగ్గర పార్క్‌ చేశాడు. అయితే ఆ బస్సులోని నుంచి వింత శబ్ధాలు వస్తుండడంతో గ్రామస్థులు అలర్ట్ అయ్యారు. ఇంతకీ బస్సులో ఏముందా అని డోర్‌ తెరిచి చూడగా అక్కడ వారికి కనిపించిన దృశ్యం వారికి ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్‌బరేలికి చెందిన స్కూల్‌ను బస్సును డ్రైవర్‌ తన గ్రామానికి తీసుకెళ్లి ఇంటి దగ్గర పార్క్‌ చేశాడు.

అయితే ఎక్కడ నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిందో తెలియదు కానీ ఓ భారీ కొండ చిలువ బస్సులోకి చేరింది. బస్సు పక్క నుంచి వెళుతున్న వారికి బస్సులో నుంచి వింత శబ్ధాలు వినిపించాయి. ఇంతకీ బస్సులో ఏముందా అని కొంత మంది ధైర్యం చేసిన డోర్‌ ఓపెన్‌ చూసి చూడగా బస్సులో భారీ కొండ చిలువ దర్శనమిచ్చింది. ఇంజిన్‌ భాగం వద్ద ఓ సీట్‌ కింద పెద్ద కొండచిలువ దాక్కుంది. దీంతో సమాచారం అందుకున్న సిటీ సీఓ వందనా సింగ్, సిటీ మెజిస్ట్రేట్ పల్లవి మిశ్రా అక్కడికి చేరుకున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియో.. 

 

వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో గంటపాటు శ్రమించి కొండచిలువను పట్టుకున్నారు. ఆ కొండచిలువ బరువు 80 కేజీలు, పదకొండున్నర అడుగుల పొడవు ఉంది. అనంతరం దానిని అడవిలోకి వదిలిపెట్టారు. ఒకవేళ ఉదయం స్కూల్‌ పిల్లలు బస్సు ఎక్కితే పరిస్థితి ఎలా ఉండేదో అని గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు బస్సులో నుంచి కొండచిలువను బయటకు తీస్తున్న సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..