Phone Explosion: స్మార్ట్‌ఫోన్ పేలి చిన్నారి మృతి.. ఘటనపై రెడ్‌మీ ఇచ్చిన వివరణ ఏమిటంటే..?

|

Apr 28, 2023 | 8:08 AM

కేరళకు చెందిన 8 ఏళ్ల చిన్నారి ఆదిత్యశ్రీ రెడ్‌మీ ఫోన్‌ పేలి మృతి చెందడంపై ఆ ఫోన్ తయారీ సంస్థ స్పందించింది. తమ కంపెనీకి చెందిన ఫోన్‌ పేలిన కారణంగానే బాలిక మృతి చెందిందన్న వార్తలను రెడ్‌మీ ఖండించింది. బాలిక మృతిపై వస్తున్న వార్తలు కేవలం ఆరోపణలేనని, ఫోన్‌ పేలడానికి..

Phone Explosion: స్మార్ట్‌ఫోన్ పేలి చిన్నారి మృతి.. ఘటనపై రెడ్‌మీ ఇచ్చిన వివరణ ఏమిటంటే..?
Exploded Xioami Smartphone
Follow us on

కేరళకు చెందిన 8 ఏళ్ల చిన్నారి ఆదిత్యశ్రీ రెడ్‌మీ ఫోన్‌ పేలి మృతి చెందడంపై ఆ ఫోన్ తయారీ సంస్థ స్పందించింది. తమ కంపెనీకి చెందిన ఫోన్‌ పేలిన కారణంగానే బాలిక మృతి చెందిందన్న వార్తలను రెడ్‌మీ ఖండించింది. బాలిక మృతిపై వస్తున్న వార్తలు కేవలం ఆరోపణలేనని, ఫోన్‌ పేలడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. బాలిక మృతిపై విచారణ పూర్తయ్యే వరకు దర్యాప్తులో అధికారులకు సహకరిస్తామని పేర్కొంది. ‘కస్టమర్ల సేఫ్‌టీ మాకు ప్రధానం. వారి భద్రత విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాం. బాలిక మృతితో క్లిష్టపరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం. మా ఫోన్ పేలడం వల్లనే బాలిక మృతి చేందిదంనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంలో విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. బాలిక మృతికి గల అసలు కారణాలమేిటో తెలుసుకునే క్రమంలో అధికారులకు పూర్తిగా సహకరిస్తాం’ అంటూ రెడీ‌మీ ఓ ప్రకటనను విడుదల చేసింది.

కాగా, కేరళ త్రిస్సూర్‌కు చెందిన 8 ఏళ్ల బాలిక ఫోన్‌లో సినిమా చూస్తుండగా ఒక్కసారిగా పేలిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు ఫోరెన్సిక్‌ టీమ్ కూడా రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే రెడ్‌మీ కంపెనీకి చెందిన ఫోన్‌ పేలడం వల్లనే బాలిక మరణించిందనే వార్తలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని పోలీసులు కానీ, ఇతర ఆధికారులు కానీ ఇంకా ధృవీకరించలేదు. అయినా స్మార్ట్‌ఫోన్ పేలడం వంటి ఘటనలు దేశంలో కొత్తేమి కాదని పలువురు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..