50ఏళ్లుగా ఆహారం వాసన కూడా చూడని వృద్ధురాలు.. ఎలా జీవిస్తుందో తెలిస్తే మాత్రం అవాక్కే..!

|

Dec 09, 2023 | 8:34 AM

గతంలో ఆమె యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స చేయడానికి, మరికొందరు మహిళలతో కలిసి పర్వతాన్ని అధిరోహించారు. ఆ సమయంలోనే పిడుగుపాటుకు గురై కింద పడిపోయారు. కొంతకాలానికి కోలుకున్న తర్వాత ఆమె ఆహారానికి బదులుగా మంచినీళ్లు మాత్రమే తీసుకోవడం ప్రారంభించారు. అప్పటి నుండి ఇదే ధోరణి కొనసాగుతోందని చెప్పారు. విశేషమేమిటంటే ఆమె తన పిల్లలకు పాలు కూడా పట్టలేదని తెలిసింది.

50ఏళ్లుగా ఆహారం వాసన కూడా చూడని వృద్ధురాలు.. ఎలా జీవిస్తుందో తెలిస్తే మాత్రం అవాక్కే..!
Water And Soft Drink
Follow us on

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. ఇది శరీరంలో శక్తిని నింపడమే కాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే ఒక వ్యక్తి ఆహారం లేకుండా కేవలం నీటిపై ఆధారపడి మాత్రమే జీవించగలడని మీరు విన్నారా..?అవును. దాదాపు 50 సంవత్సరాలుగా నీళ్లు, శీతల పానీయాలు మాత్రమే తాగుతూ జీవించి ఉన్న ఒక మహిళ గురించి తెలిస్తే మాత్రం మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతున్నారు. మహిళ వయస్సు 75 సంవత్సరాలు, తాను 50 సంవత్సరాలుగా ఎటువంటి ఘనపదార్థాలకు సంబంధించిన ఆహారం తినలేదని చెప్పింది. నీళ్లు, శీతల పానీయాలు మాత్రమే తాగుతూ బతుకుతుంది.

మీడియా కథనాల ప్రకారం, ఈ వియత్నామీస్ మహిళ వయస్సు 75 సంవత్సరాలు. తాను 50 సంవత్సరాలుగా ఎటువంటి ఘనమైన ఆహారం తినలేదట. నీళ్లు, శీతల పానీయాలు మాత్రమే తాగుతూ జీవిస్తుంది. వియత్నాంలోని క్వాంగ్ బిన్హ్ ప్రావిన్స్‌లో నివసించే బుయ్ థి లోయి ఇప్పటి వరకు కేవలం నీళ్లు, కూల్‌డ్రింక్స్‌ వంటివి మాత్రమే తీసుకుంటారట. 1963 సంవత్సరంలో ఆమె యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స చేయడానికి, మరికొందరు మహిళలతో కలిసి పర్వతాన్ని అధిరోహించారు. ఆ సమయంలోనే పిడుగుపాటుకు గురై కింద పడిపోయారు. కొంతకాలానికి కోలుకున్న తర్వాత ఆమె ఆహారానికి బదులుగా మంచినీళ్లు మాత్రమే తీసుకోవడం ప్రారంభించారు. అప్పటి నుండి ఇదే ధోరణి కొనసాగుతోందని చెప్పారు. విశేషమేమిటంటే ఆమె తన పిల్లలకు పాలు కూడా పట్టలేదని తెలిసింది.

75 ఏళ్ల వయసులో ఉన్న ఆ మహిళ..ఆహారం వాసన తనకు వికారంగా ఉంటుందని పేర్కొంది. కానీ, తన పిల్లలకు మాత్రం ఆహారం తనే వండి పెట్టేదని చెప్పింది. బుయ్ మాత్రం 50 సంవత్సరాలుగా కేవలం నీళ్లు, కూల్‌డ్రింక్స్‌ మాత్రమే తీసుకుంటూ.. జీవించి ఉంటోందని తెలిసి ప్రజలు చాలా ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో ఆయన గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. వియత్నాం-క్యూబా ఆసుపత్రిలోని పోషకాహార విభాగం వైద్యులు చెప్పిన దాని ప్రకారం, చక్కెర కలిగి కూల్‌డ్రింక్స్‌ శరీరానికి శక్తిని అందిస్తాయి. కానీ, వాటి అధిక వినియోగం మానవ ఆరోగ్యానికి ప్రమాదకరం అంటున్నారు. శీతలపానీయాలు ఎక్కువగా తీసుకోవటం వల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి సమస్యలకు దారితీస్తుందని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..