Python Found In Faridabad: హర్యానా, ఫరీదాబాద్‌లోని ఓ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన ఇంట్లోని బాత్రూంలోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. డోర్ తీయగానే లోపల కనిపించిన దృశ్యం చూసి కంగతున్నాడు. 7 అడుగుల పొడవైన భారీ కొండచిలువ లోపల వాటర్ టాప్‌లకు చుట్టుకుని దర్శనమిచ్చింది. దీంతో ఒక్క ఉదుటన బయటకు వచ్చి వెంటనే దగ్గర్లోని ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు, అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరకున్న పోలీసులు, వన్యప్రాణి విభాగం సిబ్బంది ఎంతో శ్రమించి ఆ కొండచిలువని రెస్క్యూ చేశారు. అందిన సమాచారం ప్రకారం.. కొండచిలువ బాత్రూమ్ కుళాయిలకు చుట్టుకొని ఉంది. ఇక్కడ కొండచిలువలు సాధారణంగా జనం కంట పడుతుంటాయి. అయితే ఇంటిలోకి ప్రవేశించడం ఇదే మొదటిసారి అని చెప్పారు. కొండచిలువ సంచారంతో ఆ ప్రాంత ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. వేసవితాపం కారణంగా కొండచిలువలు నివాస ప్రాంతాల్లోకి వచ్చే ప్రమాదం ఉందని.. చిన్న పిల్లలకు, పెంపుడు జంతువులకు వీటి వల్ల ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. అటవీ శాఖ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: Crime News: చిరుత మాంసంతో కమ్మటి విందు.. ఆపై మరో ప్లాన్.. కట్ చేస్తే..