Viral Video: 60 ఏళ్ల రోజువారి కూలీ ఇప్పుడు సూపర్ మోడల్‌.. సోషల్‌మీడియాలో సంచలనం సృష్టిస్తున్న వీడియో..

Viral Video: జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలంటే కొంచెం అదృష్టం తోడవ్వాలి. ఎవరి జీవితం ఎప్పుడు మారుతుందో ఎవ్వరు ఊహించలేరు. కానీ అదృష్టం

Viral Video: 60 ఏళ్ల రోజువారి కూలీ ఇప్పుడు సూపర్ మోడల్‌.. సోషల్‌మీడియాలో సంచలనం సృష్టిస్తున్న వీడియో..
Mammikka

Edited By: Phani CH

Updated on: Feb 15, 2022 | 2:04 PM

Viral Video: జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలంటే కొంచెం అదృష్టం తోడవ్వాలి. ఎవరి జీవితం ఎప్పుడు మారుతుందో ఎవ్వరు ఊహించలేరు. కానీ అదృష్టం వల్ల కొంతమంది ఫేమస్‌గా మారిపోతారు. కేరళలోని కోజికోడ్‌లో నివసిస్తున్న మమ్మిక్క అనే 60 ఏళ్ల రోజువారి కూలీ కూడా ఇలాగే ఫేమస్ అయ్యాడు. అతడిపై ఓ ఫొటోగ్రాఫర్ కన్నుపడింది. అంతే అతడు ఒక మోడల్‌గా మారిపోయాడు. తన గ్లామరస్ లుక్‌తో ఇంటర్నెట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్నాడు. మమ్మిక తాజా ఫోటోషూట్ వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో అతడి స్టైల్ లుక్‌ని అందరు ఇష్టపడుతున్నారు. మీడియా నివేదికల ప్రకారం..ఇటీవల స్థానిక సంస్థ ప్రమోషన్ కోసం మమ్మిక ఫోటోషూట్ చేశాడు. ఇందులో అతను విలాసవంతమైన సూట్‌లో, చేతిలో ఐప్యాడ్‌తో కనిపిస్తాడు. ఫోటోగ్రాఫర్ షరీక్ వాయిల్ ఈ దినసరి కూలీని మోడల్‌గా మార్చాడు. ఇప్పుడు అతడి ఫొటోలు సోషల్‌మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.

ఇంతకుముందు ఫోటోగ్రాఫర్ షారిక్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి మమ్మిక్క ఫోటోను పోస్ట్ చేసాడు. ఇది నటుడు వినాయకన్‌తో సమానంగా ఉంటుంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఫోటోగ్రాఫర్ షరీక్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ప్రకారం.. ఆషిక్ ఫువాద్, షబీబ్ వాయిల్ అనే మేకప్ అసిస్టెంట్లుగా మమ్మిక్కని ఇలా మార్చారు. మోడల్‌గా మారడంతో మమ్మిక్కా చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. ఉద్యోగంతో పాటు మోడలింగ్‌ ఆఫర్లు వస్తున్నాయని చెప్పాడు. అంతేకాదు అతడు ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను కూడా సృష్టించాడు. తన పోస్ట్ మేక్ఓవర్ చిత్రాలను అందులో షేర్ చేశాడు. ఒక సాధారణ మనిషి ఇప్పుడు ఒక మోడల్‌గా తయారవడంతో అందరు ఫొటో గ్రాఫర్‌ని ప్రశంసిస్తున్నారు.

Tarisai Musakanda: యాక్సిడెంట్ చేసిన క్రికెటర్.. టెన్నిస్ ప్లేయర్ మృతి..

Coconut Dosa: కొబ్బరి దోశ రుచి చూస్తే ఫిదా కావాల్సిందే.. ఇంట్లోనే ఇలా తయారుచేయండి..?

IPL 2022: ఈ 4 కోట్ల ఆల్‌రౌండర్‌పై ధోని ఎన్నో ఆశలు.. టీమిండియాలో చోటు లభిస్తుందా..?