4 నిమిషాల్లో 52 సార్లు ‘సారీ’ చెప్పిన 8వ తరగతి విద్యార్ధి.. అంతలో ఊహించని దారుణం!

ఓ 8వ తరగతి బాలుడు స్కూల్‌కి సెల్‌ ఫోన్‌ తెచ్చాడు. క్లాస్‌ రూంలో రీల్స్‌ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఆగ్రహించిన ప్రిన్సిపల్ బాలుడి తల్లిదండ్రులను స్కూల్‌కి పిలిచించాడు. అయితే పేరెంట్స్‌కి ఫిర్యాదు చేయవద్దని సదరు బాలుడు 4 నిమిషాల్లో 52 సార్లు 'సారీ' చెప్పాడు. అయినా కనిపికరించకపోవడంతో సదరు బాలుడు స్కూల్‌ భవనం 3వ అంతస్తు నుంచి అమాంతం కిందకి దూకేశాడు. సంఘటన సమయంలో బాలుడి తల్లిదండ్రులు స్కూల్‌లోనే ఉండటం గమనార్హం. మధ్యప్రదేశ్‌లోని రత్లాంలోని డోంగ్రే నగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

4 నిమిషాల్లో 52 సార్లు సారీ చెప్పిన 8వ తరగతి విద్యార్ధి.. అంతలో ఊహించని దారుణం!
8th Class Student Suicide

Updated on: Nov 30, 2025 | 10:38 AM

మధ్యప్రదేశ్‌, నవంబర్‌ 30: మధ్యప్రదేశ్‌లోని రత్లాంలోని డోంగ్రే నగర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో 8వ తరగతి బాలుడు మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. జాతీయ స్థాయి స్కేటింగ్ ఆటగాడు అయిన సదరు విద్యార్ధి శుక్రవారం ఈ మేరకు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పాఠశాల యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం..

బాదిత విద్యార్థి గురువారం తన మొబైల్ ఫోన్‌ను పాఠశాలకు తీసుకువచ్చి క్లాస్‌ రూంలో వీడియోను రికార్డ్ చేసి, ఆ తర్వాత దానిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. పాఠశాల యాజమాన్యం ఈ వీడియోను గుర్తించి శుక్రవారం బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి స్కూల్‌కి పిలిపించాడు. స్కూల్ సీసీటీవీ ఫుటేజ్‌లో మొత్తం దృశ్యాలు రికార్డు అయ్యాయి. 13 ఏళ్ల బాలుడు ప్రిన్సిపాల్ ఆఫీస్‌లోకి ప్రవేశించడం వీడియోలో చూడొచ్చు. లోపల విద్యార్ధి దాదాపు నాలుగు నిమిషాలు తన తప్పుకు పదే పదే క్షమాపణలు కోరుతూ భయం 52 సార్లు ‘సారీ’ అని చెప్పడం వీడియోలో కనిపించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్ధి.. తనను బ్లాక్‌ మెయిల్ చేశాడని పోలీసులకు తెలిపాడు. ప్రిన్సిపాల్ తన కెరీర్‌ను ముగించాలని, తనను సస్పెండ్ చేయాలని, తాను సాధించిన పతకాలను లాక్కుంటానని బెదిరించినట్లు ఆరోపించారు. స్కేటింగ్‌లో ఇప్పటికే సాధించిన విజయాలకు పేరుగాంచిన ఆ బాలుడు రెండుసార్లు జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించాడు.

8th Class Student Suicide

ఇది జరిగిన కొన్ని క్షణాల తర్వాత బాలుడు ఆఫీసు నుంచి బయటకు పరుగెత్తుకుంటూ, కారిడార్ గుండా వెళ్లి మూడవ అంతస్తు నుంచి దూకడం వీడియోలో కనిపించింది. సంఘటన సమయంలో బాలుడి తండ్రి స్కూల్ వెయిటింగ్‌ రూంలో కూర్చుని ఉన్నాడు. అతడికి కొన్ని మీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. బాలుడి తండ్రి మాట్లాడుతూ.. స్కూల్‌ నుంచి నాకు రెండు సార్ల కాల్‌ వచ్చింది. మొదటి కాల్‌ నా కొడుకును కలవడానికి స్కూల్‌కి రావాలని తెలిపారు. రెండో కాల్ ఆస్పత్రికి రావాలని తెలిపారు. నా కొడుకు స్కేటింగ్‌లో రెండుసార్లు జాతీయ క్రీడలకు హాజరయ్యాడు అని విద్యార్థి తండ్రి ప్రీతమ్ కటారా అన్నారు. పాఠశాలలో మొబైల్ ఫోన్లు అనుమతించబడవు. ఉపాధ్యాయుల ఫోన్లు కూడా జప్తు చేస్తారు. స్కూల్‌కి ఫోన్‌ తీసుకువచ్చిన బాలుడిపై క్రమశిక్షణా చర్య తీసుకునే ముందు బాలుడి తండ్రితో మాట్లాడాలని పాఠశాల యాజమాన్యం భావించింది. అయితే బాలుడు పదే పదే క్షమాపణలు చెప్పినా.. ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడంతో ఈ దారుణం చోటు చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.