హే ప్రభూ.. ఇదెక్కడి విడ్డూరం.. టూత్ బ్రష్‌ను అమాంతంగా మింగేసిన మహిళ.. చివరికి ఏమైందంటే?

|

Nov 13, 2024 | 9:54 AM

40 ఏళ్ల మహిళ నాలుకను శుభ్రం చేస్తూ అనుకోకుండా 20 సెంటీమీటర్ల పొడవున్న టూత్ బ్రష్ మింగేసింది. బాధితురాలు ట్రీట్మెంట్ కోసం వచ్చినపుడు డాక్టర్లు కూడా షాక్‌ అయ్యారు. ఇది కచ్చితంగా అసాధారమైన ఘటన. ఎందుకంటే.. గతంలో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరిగాయనే చెప్పాలి.

హే ప్రభూ.. ఇదెక్కడి విడ్డూరం.. టూత్ బ్రష్‌ను అమాంతంగా మింగేసిన మహిళ.. చివరికి ఏమైందంటే?
Swallows Toothbrush
Follow us on

కొన్నిసార్లు పిల్లలు ఆడుకుంటూ కాయిన్స్‌ మింగేస్తుంటారు. లేదా చిన్న చిన్న ఆట వస్తువులు వంటివి గొంతు, చెవి, ముక్కులో పెట్టేసుకుంటుంటారు. ఇక దాంతో తల్లిదండ్రులు దీన్ని తొలగించేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుంది. అయితే 40 ఏళ్ల మహిళ అనుకోకుండా టూత్ బ్రష్ మింగిసేంది. వింటే షాకింగ్‌గా ఉంది కదా.? కానీ, ఇది నిజమే. మహారాష్ట్రలోని పూణేలో మహిళ టూత్‌బ్రష్‌ను మింగిన ఘటన స్థానికులతో పాటు వైద్యులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పుణెకు చెందిన 40 ఏళ్ల మహిళ నాలుకను శుభ్రం చేస్తూ అనుకోకుండా 20 సెంటీమీటర్ల పొడవున్న టూత్ బ్రష్ మింగేసింది. బాధితురాలు ట్రీట్మెంట్ కోసం వచ్చినపుడు డాక్టర్లు కూడా షాక్‌ అయ్యారు. ఇది కచ్చితంగా అసాధారమైన ఘటన. మహారాష్ట్ర, పుణెలలో ఈ తరహా కేసు నమోదవడం ఇదే తొలిసారి అని ఓ సీనియర్ వైద్యుడు చెప్పారు. శస్త్రచికిత్స చేసి బ్రష్ తొలగించామని, ఆమెకు ఎలాంటి అంతర్గత గాయాలు కాలేదని వైద్యులు తెలిపారు.

టూత్‌బ్రష్‌ను మింగిన ఘటన ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదు. ప్రపంచవ్యాప్తంగా 30 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. మానసిక ఆరోగ్య పరిస్థితులు సరిగా లేని వ్యక్తులలో ఇలాంటి సంఘటనలు జరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. చిన్నచిన్న వస్తువులను మింగుతున్న ఉదంతాలు రోజురోజుకూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. కానీ 20 సెంటీమీటర్ల బ్రష్‌ను మింగడం బహుశా మొత్తం రాష్ట్రంలోనే మొదటి సంఘటన కావచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..