పక్కింటోళ్ల నోటి దూలపై రూ. 62 లక్షల దావా.. యువతికి నెటిజన్ల నీరాజనం.. అసలేం జరిగిందంటే?

అపార్ట్‌మెంట్లలో ఉండే బ్యాచిలర్స్ లేదా ఒంటరిగా ఉండే మహిళల పట్ల కొందరు ప్రదర్శించే ప్రవర్తనకు ఓ బెంగళూరు యువతి గట్టి గుణపాఠం చెప్పింది. కాలి మాటలతో సరిపెట్టకుండా.. ఏకంగా వారిపై రూ. 62 లక్షల పరువు నష్టం దావా వేసి వారికి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

పక్కింటోళ్ల నోటి దూలపై రూ. 62 లక్షల దావా.. యువతికి నెటిజన్ల నీరాజనం.. అసలేం జరిగిందంటే?
Bengaluru Apartment Issue,( Representative Image)

Edited By:

Updated on: Dec 23, 2025 | 4:57 PM

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై వంటి ప్రధాన నగరాలకు వలస వచ్చి అపార్ట్‌మెంట్లలో ఉండే బ్యాచ్‌లర్, అబ్బాయిలు, అమ్మాయిల పట్ల కొందరు మితిమీరి ప్రవర్తిస్తుంటారు. వారిని చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. తాజాగా ఇలా మాట్లాడిన కొందరి ఒక యువతి గట్టి గుణాపాఠం చెప్పింది. కేవలం మాటలతో సరిపెట్టక.. ఏకంగా వారిపై రూ.62లక్షల పరువునష్టం దావా వేసి వారికి ఊహించని షాక్ ఇచ్చింది. ఈ ఘటన బెంగళూరు సిటీలో వెలుగు చూసింది.

వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని ఓ గేటేడ్ కమ్యూనిటీ సొసైటీలో 22 ఏళ్ల యువతి ప్లాట్‌ కొని అక్కడే నివసిస్తుంది. అయితే శనివారం వికెండ్ కావడంతో ఆరోజు రాత్రి ఆమె స్నేహితులు ఇంటికి వచ్చారు. అదే టైంలో కొందరు సొసైటీ సభ్యులు ఆమె తలుపు తట్టారు. ఇక్కడ బ్యాచిలర్లకు అనుమతి లేదు.. నీ ఫ్లాట్ ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ గొడవకు దిగారు. దానికి ఆమె ఈ ఫ్లాట్ ఓనర్ ని నేనే అని చెప్పడంతో గొడవ మరింత పెరిగింది. సొసైటీ బోర్డు సభ్యులమని చెప్పుకుంటూ ఐదుగురు వ్యక్తులు తన అనుమతి లేకుండా ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడ నానా హంగామా సృష్టించారు. అయితే వారి చేసిన తతంగమంతా..యువతి లివింగ్ రూమ్‌లో ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యింది.

పోలీసులు వచ్చినప్పటికీ ఆమె దగ్గర ఉన్న వీడియో సాక్ష్యాలు చూసి వెనుదిరిగారు. ఈ అవమానాన్ని భరించలేని ఆ యువతి చట్టపరంగా పోరాడాలని నిర్ణయించుకుంది. సీనియర్ లాయర్ సలహాతో లీగల్ ప్రొసిడింగ్ చేసింది. సొసైటీ బోర్డుకు లీగల్ నోటీసులు పంపింది. కేవలం క్రిమినల్ కేసు వేస్తే ఏళ్ల తరబడి సాగుతుందని భావించి.. అతిక్రమణ, వేధింపులు, స్టాకింగ్, ప్రైవసీ హక్కు ఉల్లంఘన కింద ఏకంగా రూ. 62 లక్షల పరిహారం కోరుతూ సివిల్ కేసు వేసింది. ఆమె దగ్గర ఉన్న వీడియో ఆధారాలను బిల్డర్, చైర్మన్‌కు చూపించడంతో, నిబంధనలు ఉల్లంఘించిన ఆ సభ్యులను పదవుల నుంచి తొలగించడమే కాకుండా, ఒక్కొక్కరికి రూ. 20,000 జరిమానా కూడా విధించారు.

“క్షమించండి.. కేసు వెనక్కి తీసుకోండి”

కోర్టు కేసు ఫైల్ అయిన తర్వాత, నిందితుల కుటుంబ సభ్యులు వచ్చి కేసు వెనక్కి తీసుకోవాలంటూ యువతిని బ్రతిమలాడారు. కానీ ఆ యువతి మాత్రం వెనక్కి తగ్గ లేదు. ఈ ఇందుకు సంబంధించిన కథనం రెడ్డిట్ (Reddit) లో వైరల్ కావడంతో నెటిజన్లు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం ఇంత త్వరగా లీగల్ ప్రాసెస్ ఎలా పూర్తయిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.