Viral Video: ధైర్యమున్నోడు దడుసుకోవాల్సిందే.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా కుప్పలు తెప్పలుగా

|

Jul 19, 2024 | 9:45 PM

ఇంటి లోపలా, బయటా ఒక్క పాము కనపడితే చాలు.. మన నుదుటి మీద చెమటలు పడతాయి. అంత ఎందుకు పాము గురించి ఆలోచన వస్తే చాలు.. ఒక్కసారి గుండె ఆగినంత పనవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇల్లంతా పాములతో నిండిపోతే.. అవునండీ ఇది నిజమే..

Viral Video: ధైర్యమున్నోడు దడుసుకోవాల్సిందే.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా కుప్పలు తెప్పలుగా
Snakes
Follow us on

ఇంటి లోపలా, బయటా ఒక్క పాము కనపడితే చాలు.. మన నుదుటి మీద చెమటలు పడతాయి. అంత ఎందుకు పాము గురించి ఆలోచన వస్తే చాలు.. ఒక్కసారి గుండె ఆగినంత పనవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇల్లంతా పాములతో నిండిపోతే.. అవునండీ ఇది నిజమే.. ముజఫర్‌పూర్ జిల్లా సారయ్య బ్లాక్‌లోని ఖైరా గ్రామంలో ఇలాంటి ఉదంతం ఒకటి వెలుగు చూసింది. ఇక్కడ ఓ ఇంట్లో 16 కోబ్రా పాములు కనిపించగా, వాటికి దగ్గరలోనే మరో 32 పాము గుడ్లు ఉండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. ఇది చూసి అటవీ శాఖ సిబ్బంది కూడా అవాక్కయ్యారు.

ఇది చదవండి: చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నాడు.. తీరా మూత ఓపెన్ చేయగా

ఇవి కూడా చదవండి

వివరాల్లోకి వెళ్తే.. సారయ్య బ్లాక్‌లోని ఖైరా గ్రామానికి చెందిన సంజీత్ మహతో అనే వ్యక్తి ఇంట్లో గత రెండు రోజులుగా పాములు దర్శనమిస్తున్నాయి. వర్షపు నీరు ఇంకిపోవడంతో పాములు వచ్చాయని భావించారు. 12 పాము పిల్లలను పట్టుకుని పొలంలో వదిలేశారు. అయితే అతని ఇంట్లోని రంధ్రాల నుంచి పాములు రావడం మాత్రం ఆగలేదు. ఇలా ఒక్కసారిగా కుప్పలు తెప్పలుగా పాములు వస్తుండటంతో సంజీత్ భయంతో విషయాన్ని వెంటనే గ్రామస్తులకు చెప్పాడు. వాళ్లంతా అతడి ఇంటికి చేరుకొని మొత్తం వెతకగా.. పదుల సంఖ్యలో పాములు కనిపించడంతో పాటు.. ఓ చోట 32 పాము గుడ్లు కనిపించడంతో దెబ్బకు షాక్ అయ్యారు.

ఇది చదవండి: అంబానీ సంపద కరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెల్సా..? లెక్కలు చూస్తే షాకే

వాటినన్నింటినీ అటవీ శాఖ సిబ్బందితో పట్టుకుని.. బంధించారు. అనంతరం సంజీత్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అటవీ శాఖ డాక్టర్ రాజీవ్ రంజన్ మాట్లాడుతూ.. ఇంట్లో ఎలుకలు తవ్విన గుంతలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాం. అందులో పాములు ఉన్నాయి. నిజానికి, నాగుపాము ఎప్పుడూ రంధ్రం చేయదు, ఎలుకల రంధ్రంలో మాత్రమే గుడ్లు పెడుతుంది అని చెప్పారు. ఈ గుంతలు తవ్వగా 16 పాములు కనిపించగా, 32 గుడ్లు కూడా దొరికాయి. పాములన్నీ నాగుపాములు కావడంతో ఇంట్లోనే ఆశ్రయం పొందాయి.

ఇది చదవండి: ముఖం ఆకృతి మీలోని సీక్రెట్స్‌ను ఈజీగా చెబుతుందట.. అదెలాగంటే.?