ఒక బిడ్డకు జన్మనివ్వడం అనేది ఆ మహిళకు నిజంగా సంతోషకరమైన విషయం. ఆమె దాని కోసం తొమ్మిది నెలలు ఎదురుచూస్తుంది. కానీ, ఎక్కడైనా నెలల ఆడపిల్ల మరో బిడ్డకు జన్మనిస్తుందని ఎప్పుడైనా విన్నారా..? అవును…ఇది వినేందుకు షాకింగ్ గా ఉన్నప్పటికీ అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. 10 నెలల చిన్నారికి కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి తల్లిదండ్రులు వైద్యులు షాకింగ్ విషయాన్ని చెప్పారు. అది విన్న ఆ తల్లిదండ్రులు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. ఇదీ అని చెప్పలేని బాధతో చిన్నారి ఏడుస్తుంది. తరచూ పాప ఏడుపు ఆపకపోవడంతో ఆ తల్లిదండ్రులు చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ శిశువు కడుపు కింది భాగంలో నొప్పి వస్తున్నట్టుగా వైద్యులు గమనించారు. చిన్నారి పొట్టలో ఏదైనా కణితి లాంటిది ఉందేమోనని భావించారు. అన్ని టెస్టులు చేయగా, పసికందు కడుపులో ఉన్న సమస్యను చూసి డాక్టర్లు సైతం నివ్వెర పోయారు. 10నెలల శిశువు కడుపులో రెండు జంట పిండాలు కనిపించాయి.
ఈ షాకింగ్ ఘటన పాకిస్థాన్‌లోని సాదికాబాద్‌లో చోటు చేసుకుంది. గుక్కపట్టి ఏడుస్తున్న 10నెలల చిన్నారిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. శిశువు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుందని గుర్తించిన డాక్టర్లు బాలికకు అల్ట్రాసౌండ్ చేశారు. తొలుత బాలిక కడుపు కింది భాగంలో కణితి లాంటిది ఏర్పడి ఉంటుందని, బాలిక కడుపు ద్రవంతో నిండిపోయిందని వారు భావించారు. దానికోసం వెంటనే చిన్నారికి ఆపరేషన్ చేయాలని చెప్పారు. దాదాపు రెండు గంటల పాటు చిన్నారికి ఆపరేషన్ నిర్వహించారు. సర్జరీ చేసి బాలిక పొత్తికడుపు దిగువ నుండి కణితిని తొలగించినప్పుడు వారికి మరో షాకింగ్ సీన్ కనిపించింది.
బాలికకు ఆపరేషన్ చేసిన కణతిని తొలగించిన వైద్యులు..బాలిక కడుపులో పూర్తిగా ఎదగని రెండు జంట పిండాలను గుర్తించారు. సుమారు 5 లక్షల మంది ఆడపిల్లల్లో ఒకరికి మాత్రమే వచ్చే వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే వ్యాధికి ఆ బాలిక బాధితురాలు అని డాక్టర్లు స్పష్టం చేశారు. తల్లి కడుపులో పిండం ఒక బిడ్డ అభివృద్ధి చెందినప్పుడు కవల పిండాలు ఆరోగ్యవంతమైన శిశువు శరీరంలో ఇలా ఇరుక్కుపోయాయని.. అవి అభివృద్ధి చెందలేనప్పుడు ఇలాంటిది జరుగుతుందని సర్జన్ ముస్తాక్ అహ్మద్ తెలిపారు. చిన్నారికి ఆపరేషన్ చాలా కష్టంగా మారిందన్నారు. రెండు గంటల పాటు శ్రమించిన వైద్యులు పాప ఆపరేషన్ సక్సెస్ చేశారు. ప్రస్తుతం శిశువు పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. దాంతో చిన్నారి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..