
Viral Video: అడవుల్లో చెట్లను నరికివేయడం, సహజ వనరులు తగ్గడం.. కారణం ఏదైనా అడవుల్లో నివసించాల్సిన జంతువులు జనావాసంలోకి రావడం ఇటీవల రోటిన్‌గా మారిపోయింది. పులల నుంచి మొదలు ఎలుగుబంట్లు, పాముల వరకు ప్రజల్లోకి వచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. తమ ప్రాణాలకు ఎక్కడ ముప్పు కలుగుతుంతో అని భావించి మనుషులు జంతువులపై దాడి చేయడం, జంతువులు మనుషులపై దాడి చేయడం పరిపాటుగా మారిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా పది అడుగుల తాచు పాము ఒకటి జనాలను భయాందోళనకు గురి చేసింది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోకి కార్వార్ సమీపంలో ఉన్న నారాగెరికి సమీపంలో ఉన్న అడవి నుంచి ఓ భారీ తాచు పాము గ్రామంలోకి వచ్చింది. పది అడుగులున్న తాచు పామును చూసిన జనలు హడలెత్తి పోయారు. పైపైకి ఎగురుతూ బుసలు కొట్టిన పాము స్థానికులను ఆందోళనకు గురి చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నితిన్ పూజారి అనే స్నేక్ లవర్ సంఘటన స్థలానికి చేరుకొని దానిని చాకచక్యంగా ఒక సంచిలో బంధించి ఊరికి దూరంగా తీసుకెళ్లి అడవిలోకి తిరిగి పంపించేశాడు. అయితే పామును విడిచిపెడుతున్న సమయంలో పాము అతన్ని అటాక్ చేసేందుకు ప్రయత్నించిన తీరు ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. బుసలు కొడుతూ నితిన్‌పై దాడికి ప్రయత్నించంగా అతను దానిని సేఫ్‌గా చెట్లలోకి వదిలేశాడు. ఇక దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..