జులై 16న శ్రీవారి ఆలయం మూసివేత

Tirumala temple to remain closed on July 16 due to lunar eclipse, జులై 16న శ్రీవారి ఆలయం మూసివేత

తిరుమల : ఈ నెల 16న రాత్రి చంద్రగ్రహణం నేపథ్యంలో శ్రీవారి ఆలయం మూతపడనుంది. ఆ రోజు రాత్రి  1.20 గంటలకు చంద్రగ్రహణం సందర్భంగా స్వామి వారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. 16న రాత్రి 7 గంటల నుంచి 17న ఉదయం 5గంటల వరకూ శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. 17న అర్చకులు ఆలయాన్ని శుద్ది చేసిన తర్వాత శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *