YS Sharmila: కేసీఆర్ స్పందించేంతవరకు నిరాహార దీక్షకు కూర్చుంటా అంటూ వైయస్ఆర్ టీపీ అధినేత్రి వైయస్ షర్మిల ఇవాళ సంచలన ప్రకటన చేశారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణ అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి బాధిత కుటుంబానికి పదికోట్ల పరిహారం ప్రకటించాలి అని షర్మిల డిమాండ్ చేశారు. ‘కేటీఆర్ దత్తత తీసుకున్న ప్రాంతమే ఇట్లా ఉంటే.. ఈయన రాష్ట్రాన్ని ఏం డెవెలప్ చేస్తాడు?’ అని షర్మిల కామెంట్ చేశారు.
“ఇక్కడ నీళ్లు దొరకవు, కానీ మద్యం ఏరులై పారుతుందంట. పోలీసుల వైఫల్యం కాదా ఇది? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? పోలీసులు ఎంత బాగా పనిచేస్తున్నారో తెలియజేయడానికి ఇదొక ఉదాహరణ. లాఠీఛార్జ్ చేసి మరీ చిన్నారి శవాన్ని గుంజుకుపోయారు. పోస్టుమార్టంకి తల్లిదండ్రుల అనుమతి లేకపోయినా శవాన్ని గుంజుకుపోయి పోర్టుమార్టం చేయించారు. పోస్టుమార్టం రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. ప్రజల కోసం పని చేయడంలేదు, KCR కు తొత్తుల్లా వ్యవహరిస్తున్నారు. ప్రజల టాక్స్‌లతో జీతాలు తీసుకునే పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించకుండా కేసీఆర్ కోసం పని చేస్తున్నారు.” అని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాధితులు గిరిజనులనే.. సీఎం కేసీఆర్ స్పందించలేదని షర్మిల ఆరోపించారు.
“కేసీఆర్ ఇంట్లో కుక్క హస్కీ చనిపోతే డాక్టర్ను ఉద్యోగం నుంచి తీసేసిన కేసీఆర్, చిన్నపిల్లపై అత్యాచారం జరిగితే ఎందుకు స్పందించరు. హంతకుడు దొరికాడా లేదా తెలుసుకోని మంత్రి.. ప్రజలకు సేవ చేసేందుకు ఎంత సమయం కేటాయిస్తున్నాడో అర్థమౌతుంది. ప్రజలకు సరైన సమాచారం ఇవ్వలేని కేటీఆర్ మంత్రి కావడం మన దౌర్భాగ్యం. కేసీఆర్ హుజురాబాద్ కే ముఖ్యమంత్రా..? ఎన్నికలు వస్తేనే బయటకు వస్తారు. మహిళలపై లైంగికదాడులు సీఎం కేసీఆర్ హయాంలో మూడురెట్లు అధికమయ్యాయి. కేసీఆర్ ఫామ్ హౌస్ మత్తులోనే ఉంటారు. రాష్ట్రంలో డ్రగ్స్, మద్యం, గంజాయి విచ్చలవిడిగా పెరిగాయి. అప్పుల తెలంగాణ, బార్ల తెలంగాణ, బీర్ల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణ గా మార్చారు.” అంటూ షర్మిల ధ్వజమెత్తారు.
చిన్నారి అత్యాచారం, హత్య మీద ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేసిన షర్మిల.. నిందితుడ్ని ఎన్కౌంటర్ చేస్తారా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతారా అన్నది మీ ఇష్టం.. కానీ అమ్మాయిలపై చేయివేస్తే తల తెగిపడుతుందనే భయం కల్పించాలి. అని షర్మిల అంతిమంగా టీ సర్కారుని డిమాండ్ చేశారు.
చిన్నారి చైత్ర మృతి దిగ్బ్రాంతికి గురిచేసింది. నిందితున్ని ఇంకా పట్టుకోకపోవడం పోలీసుల పనితీరుకు నిదర్శనం.కుటుంబసభ్యులు, మహిళలపై లాఠీచార్జ్ చేసి చిన్నారి మృతదేహాన్ని తీసుకెళ్లారు.ఉద్యోగాలు పోతాయనే భయంతో కేసీఆర్,మంత్రులకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు.
1/2 pic.twitter.com/esoy2YMBoO— YS Sharmila (@realyssharmila) September 15, 2021