YS Vijayamma: కొట్టాలని కొట్టలేదు.. పోలీసులపై చేయి చేసుకోవడంపై వైఎస్ విజయమ్మ క్లారిటీ..

YS Vijayamma: కొట్టాలని కొట్టలేదు.. పోలీసులపై చేయి చేసుకోవడంపై వైఎస్ విజయమ్మ క్లారిటీ..

Janardhan Veluru

|

Updated on: Apr 24, 2023 | 7:16 PM

పోలీసులపై చేయి చేసుకోవడంపై వైఎస్ విజయమ్మ క్లారిటీ ఇచ్చారు. తానుకాని, షర్మిల కాని పోలీసులను కొట్టాలని కొట్టలేదని చెప్పారామె. మీడియా కూడా నిజాలు బయటకు తీసుకురావాలని కోరారు వైఎస్‌ విజయలక్షి.

మరోవైపు షర్మిలను అరెస్ట్ చేయడంపై YS విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిలను కలిసేందుకు జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు వెళ్లిన విజయలక్ష్మి కూడా పోలీసులపై చేయి చేసుకున్నారు. దాంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. షర్మిలను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని వైఎస్‌ విజయలక్ష్మి డిమాండ్‌ చేశారు. షర్మిల ఏమైనా టెర్రరిస్టా..? అని ప్రశ్నించారు. షర్మిల ప్రజల కోసం పోరాడకూడదా? షర్మిల సిట్ ఆఫీస్‌కి వెళ్తుంటే ఎందుకు ఆపాలి అని క్వశ్చన్ చేశారు విజయలక్ష్మి. పోలీసులపై చేయి చేసుకోవడంపై వైఎస్ విజయమ్మ క్లారిటీ ఇచ్చారు. తానుకాని, షర్మిల కాని పోలీసులను కొట్టాలని కొట్టలేదని చెప్పారామె. మీడియా కూడా నిజాలు బయటకు తీసుకురావాలని కోరారు వైఎస్‌ విజయలక్షి. నేను పోలీసులను బలంగా కొట్టినట్లు టీవీల్లో చూపిస్తున్నారని వాపోయారు.

Published on: Apr 24, 2023 07:16 PM