Telangana Politics: వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో కలిపేస్తారా.. ఆ నాయకులకు షర్మిల ఫోన్స్, అభినందనలు అందుకేనా.. మారుతున్న పొలిటికల్ కెమిస్ట్రీ..

|

Jun 22, 2023 | 5:11 PM

YS Sharmila: కాంగ్రెస్‌లోకి వస్తారు..? వస్తున్నారు..? వచ్చేశారు..? ఇలా రోజుకో న్యూస్‌ సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వీటిని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ కాంగ్రెస్ పార్టీ షర్మిల ఎప్పటికప్పుడు కొట్టిపడేస్తున్నా.. షర్మిల రీసెంట్‌ యాక్టివిటీస్‌..

Telangana Politics: వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో కలిపేస్తారా.. ఆ నాయకులకు షర్మిల ఫోన్స్, అభినందనలు అందుకేనా.. మారుతున్న పొలిటికల్ కెమిస్ట్రీ..
Sharmila
Follow us on

హైదరాబాద్, జూన్ 22: వైఎస్సార్‌టీపీ అధినేత వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తారు..? వస్తున్నారు..? వచ్చేశారు..? ఇలా రోజుకో న్యూస్‌ సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వీటిని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ కాంగ్రెస్ పార్టీ షర్మిల ఎప్పటికప్పుడు కొట్టిపడేస్తున్నా.. షర్మిల రీసెంట్‌ యాక్టివిటీస్‌ మాత్రం ఈ వాదనలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. పాదయాత్రలో స్వల్ప అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు షర్మిల ఫోన్‌ చేశారు. ఆయనను పరామర్శించారు. భట్టి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న షర్మిల ఆతర్వాత రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే గత నెల డీకే శివకుమార్‌తో భేటీ తర్వాత షర్మిల వైఖరి మారిందని రాజకీయ వర్గాలంటున్నాయి. కర్నాటకలో కాంగ్రెస్‌ గెలిచిన తర్వాత షర్మిల కర్నాటక పీసీసీ చీఫ్‌ డీకే శివకుమార్‌తో భేటీ అవడం అప్పట్లో సెన్సేషన్‌గా మారింది.

రీసెంట్‌గా రాహుల్‌ గాంధీ పుట్టినరోజుకు విషెస్‌ చెప్పారు. ఇక పొంగులేటితో గతంలోనే భేటీ అవడం.. ఇప్పుడు భట్టితో పొంగులేటి భేటీ తర్వాత షర్మిల.. సీఎల్పీ నేతకు ఫోన్‌ చేయడం చూస్తుంటే ఆమె త్వరలోనే కాంగ్రెస్‌లోకి వస్తారని అంతా భావిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ తిరిగి పుంజుకోడానికి రాజకీయ పునరేకీకరణ అవసరమని అధిష్టానం కూడా భావిస్తోంది.

కర్నాటక తరహాలో నేతలంతా కలిసి పనిచేసి ముందు పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పొంగులేటి, జూపల్లితోపాటు.. షర్మిలను కూడా కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చేందుకు అన్నిరకాల వ్యూహాలు ఊపందుకున్నాయి. అటు షర్మిల కూడా వరుసగా కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లోకి రావడం.. రాష్ట్ర రాజకీయాల గురించి చర్చిస్తుండడం ఆసక్తి రేపుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం