చౌటుప్పల్: ఆన్‌లైన్ గేమ్‌కు బానిసైన ఓ వివాహిత బంధువుల వద్ద లక్షల అప్పుచేసింది. బాకీ తీర్చమని వాళ్లు ఇంటి ముందు నానాకబస చేయడంతో అవమానం భరించలేక ఆమె తన ఇద్దరు పసిబిడ్డలతో సహా సంపులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో మంగళవారం (జూన్ 27) సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం…
చౌటుప్పల్ పరిధిలోని వలిగొండ మండలం గొల్నేపల్లికి చెందిన అవిశెట్టి మల్లేశ్, భార్య రాజేశ్వరి(28) దంపతులు. వీరికి కుమారులు అనిరుధ్(5), హర్షవర్ధన్(3) ఉన్నారు. మల్లేశ్ లారీ డ్రైవర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో రాజేశ్వరి తన వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్‌లో గత ఏడాది కాలంగా ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతూ ఉండేది. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన రాజేశ్వరి బంధువుల వద్ద రూ.8 లక్షలు అప్పుచేసింది. అప్పు తీర్చమని ఓ బంధువు మంగళవారం సాయంత్రం రాజేశ్వరి ఇంటికి వచ్చి నిలదీశాడు. స్థలం విక్రయించి అప్పు తీర్చుతామన్నా సదరు వ్యక్తి ఊరుకోలేదు.
కొద్దిసేపటి తర్వాత ఆమె భర్త మల్లేశ్ ఇంటి నుంచి బయటికి వెళ్లిపోగా.. అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా ఆ తర్వాత వెళ్లిపోయాడు. తీవ్ర అవహానంగా భావించిన రాజేశ్వరి తన ఇద్దరు కుమారులను ఇంటి వద్ద ఉన్న నీటిసంపులో వేసి, తానూ దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి ఏడు గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చిన మల్లేశ్‌కి భార్యాపిల్లలు కనిపించకపోవడంతో ఇల్లంతా వెతికాడు. ఈక్రమంలో సంపు మూత తెరిచి ఉండటం చూసి అందులోకి తొంగి చూడగా భార్యపిల్లలు విగతజీవులుగా కనిపించారు. ముగ్గురినీ బయటికి తీసి సమీపంలోని ప్రభుత్వ సుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఒక్కసారే కుటుంబాన్ని పోగొట్టుకున్న మల్లేష్ కన్నీరుమున్నీరుగా విలపించాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.