Hyderabad: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. వైన్స్, బార్లు బంద్.. ఎప్పటి వరకంటే..?

మందు బాబులకు సర్కార్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర రాజధాని జంటనగరాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా రేపు అంటే.. మార్చి 27వ తేదీన హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధి‌లోని వైన్స్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

Hyderabad: మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. వైన్స్, బార్లు బంద్.. ఎప్పటి వరకంటే..?
Wines, Bar Close

Updated on: Mar 26, 2026 | 12:50 PM

మందు బాబులకు సర్కార్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర రాజధాని జంటనగరాల్లో మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా రేపు అంటే.. మార్చి 27వ తేదీన హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధి‌లోని వైన్స్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు బంద్ చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అత్యంత భక్తిభావంతో వాడవాడలా రామనామ స్మరణతో శ్రీరామనవమి వేడుకలు జరగనున్న నేపథ్యంలో.. మద్యం దుకాణాలు మూసి వేయనున్నారు. డ్రైడే నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం మార్చి 27వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం దుకాణాలతో పాటు కల్లు దుకాణాలు, బార్లు, స్టార్ హోటళ్లలో మద్యం అమ్మకాలు నిలిపి వేయాలని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ఆదేశించారు.

శ్రీరామనవమి పండుగ సందర్భంగా.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా వైన్ షాపులు మూసివేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో.. రేపు అంతా మద్యం దుకాణాలు బంద్ ఉంటాయని తెలుసుకున్న మద్యం ప్రియులు.. దగ్గర్లో ఉన్న మద్యం దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. రేపటి కోటా కూడా ఈరోజే కొనుగోలు చేస్తున్నారు. మద్యు దుకాణాలతో పాటు బార్లు, కల్లు దుకాణాలు కూడా ఒక రోజు మొత్తం బంద్ ఉండటంతో.. మందుబాబులకు బ్యాడ్ న్యూస్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us