Minister Kishan Reddy: కిషన్‌ రెడ్డి హ్యాపీగా లేరా.. ఆ మౌనం వెనుక సమాధానం ఏంటి..

రాష్ట్ర నాయకత్వంలో నెలకొన్న విబేధాలను పరిష్కరించడంతో పాటు కొత్త, పాత నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో మార్పులు చేసిన అధిష్టానం... నేతల ఇష్టాయిష్టాలను పరిగణలోకి తీసుకోలేదని

Minister Kishan Reddy: కిషన్‌ రెడ్డి హ్యాపీగా లేరా.. ఆ మౌనం వెనుక సమాధానం ఏంటి..
Kishan Reddy

Updated on: Jul 05, 2023 | 11:09 AM

తెలంగాణ బీజేపీలో ఊహించిందే జరిగింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ని తప్పించి… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టింది. అయితే రాష్ట్ర నాయకత్వంలో నెలకొన్న విబేధాలను పరిష్కరించడంతో పాటు కొత్త, పాత నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో మార్పులు చేసిన అధిష్టానం… నేతల ఇష్టాయిష్టాలను పరిగణలోకి తీసుకోలేదని స్పష్టమవుతోంది. ఊహాగానాలు కొనసాగుతున్న సమయంలో అధ్యక్ష పదవిపై కిషన్ రెడ్డి ససేమిరా అన్నారు. తనకు అంతగా ఇట్రెస్ట్ లేదని అన్నారు. మళ్లీ వెనక్కి వెళ్లడానికి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అధ్యక్ష బాధ్యతలపై మీడియా స్పందన కొరితే మౌనమే సమాధానం అన్నట్టు మాట్లాడకుండా వెళ్లిపోయారు.

తప్పని పరిస్థితిలో మాత్రమే తీసుకుంటాని.. హైకమాండ్ తప్పదు అంటూ బాధ్యతలు ఇస్తే మాత్రమే భుజానికెత్తుకుంటానని.. మంత్రి పదవి కూడా అలానే అట్టిపెట్టి ఉంచాలని పార్టీ పెద్దలను కొరినట్లుగా తెలుస్తోంది. అయితే, కిషన్ రెడ్డి చేతిలో ఉన్న పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల్లో కొన్నింటిని మార్చే అవకాశం ఉంది.

ప్రొటోకాల్‌తోపాటు అధ్యక్ష బాధ్యతలు ఉంటేనే తెలంగాణలో పర్యటించడానికి వీలుగా ఉంటుందన్నది కిషన్ రెడ్డి అభిప్రాయంలా కనిపిస్తోంది. తన మనసులోని కొన్ని మాటలను అధిష్టానం పెద్దల చెవిలో వేసినట్లుగా సమాచారం.. ఇదిలావుంటే, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దగ్గరివారి మాత్రం కేంద్రమంత్రిగా కొనసాగుతారని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం