Weekend Hour : తెలంగాణలో ఎవరి డిక్లరేషన్స్ వారివే.. మరి వారి మద్ధతు ఏ పార్టీకి?

|

Aug 26, 2023 | 8:05 PM

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాజకీయ పార్టీలు ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు రంగంలో దిగాయి. ఎస్సీ, ఎస్టీ ఓటర్లే లక్ష్యంగా పథకాలతో స్పీడు పెంచిన బీఆర్ఎస్‌. అటు డిక్లరేషన్‌తో జనాల్లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కూడా ఇప్పటికే రిజర్వుడు స్థానాల్లో గెలిచేందుకు ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్‌తో సిద్ధమవుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు అత్యంత కీలకం. 31 రిజర్వుడు సీట్లతో పాటు..

Weekend Hour : తెలంగాణలో ఎవరి డిక్లరేషన్స్ వారివే.. మరి వారి మద్ధతు ఏ పార్టీకి?
Weekend Hour With Murali Krishna
Follow us on

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న రాజకీయ పార్టీలు ఆయా వర్గాలను ఆకట్టుకునేందుకు రంగంలో దిగాయి. ఎస్సీ, ఎస్టీ ఓటర్లే లక్ష్యంగా పథకాలతో స్పీడు పెంచిన బీఆర్ఎస్‌. అటు డిక్లరేషన్‌తో జనాల్లోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కూడా ఇప్పటికే రిజర్వుడు స్థానాల్లో గెలిచేందుకు ప్రత్యేకంగా యాక్షన్ ప్లాన్‌తో సిద్ధమవుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు అత్యంత కీలకం. 31 రిజర్వుడు సీట్లతో పాటు.. కొన్ని జనరల్‌ స్థానాల్లోనూ గెలుపోటములను శాసించే స్థాయిలో గిరిజన, దళిత ఓట్లన్నాయి. దీంతో ఆయా వర్గాలకు దగ్గరయ్యేందుకు పార్టీలు రకరకాలు వ్యూహాలతో వస్తున్నాయి.

ఇప్పటికే యువత, రైతులకు ప్రత్యేకంగా డిక్లరేషన్లు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ప్రకటించింది. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఎస్సీలకు, ఎస్టీలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్‌ అంటోంది. భవిష్యత్తులోనూ ఆయా దళిత, గిరిజన వర్గాలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అంటున్నారు మల్లు రవి.

అటు 12 గిరిజన, 19 దళిత నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పథకాలు ప్రకటిస్తూ వస్తోంది. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు ప్రకటించిన అధికారపార్టీ.. ఇటీవల 4.50 లక్షల ఎకరాల పొడు పట్టాలను పంపిణీ చేసింది. అటు ఎస్సీలకు దళితబంధు పథకం అమలు చేస్తోంది. బీఆర్ఎస్‌ ఒక్కటే దళిత, గిరిజన బంధుగా మారిందని.. 50 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ ఏం చేసిందని ప్రశ్నించారు బాల్క సుమన్‌.

ఇక బీసీ పాలసీ ప్రకటించిన బీజేపీ కూడా దళిత, గిరిజన ఓటుబ్యాంకుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాలకు ప్రత్యేక పరిశీలకులను నియమించి మరీ.. వారికిచ్చే హామీలపై కసరత్తు చేస్తోంది. మొత్తానికి 119 నియోజకవర్గాలున్న తెలంగాణలో 31 రిజర్వుడు సీట్లు ఖచ్చితంగా గేమ్‌ ఛేంజర్‌ అవుతాయని పార్టీలు భావిస్తున్నాయి. అందుకే దళిత, గిరిజనులే టార్గెట్‌గా పథకాలు, హామీలు గుప్పిస్తున్నాయి. ఇంతకీ వారి మద్దతు ఎవరికి?

ఇదే అంశంపై టీవీ9 వీకెండ్ అవర్.. లైవ్ డిస్కర్షన్‌ కింది వీడియోలో చూడండి..

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..