Telangana Rains: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..

|

Sep 26, 2021 | 7:24 AM

తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజులపాటు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది

Telangana Rains: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు..
Rains
Follow us on

Heavy rains alert: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి మూడు రోజులపాటు అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. నిన్న ఏర్పడిన వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారింది. రానున్న 6 గంటల్లో ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉంది.

తుఫాను ఉత్తర ఆంధ్రా – దక్షిణ ఒడిస్సా తీర ప్రాంతాల్లో విశాఖపట్నం, గోపాలపూర్, కళింగ పట్నం దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. తుఫాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉత్తరాంధ్రకు 13 బృందాలు, దక్షిణ ఒడిశాకు 5 బృందాలు ఇప్పటికే పంపించారు. తుఫాను ప్రభావం వల్ల తెలంగాణ లోని పలు జిల్లాల్లో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతిలోని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇక, తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆది, సోమవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉందని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆరెంజ్‌‌‌‌‌‌‌‌ అలెర్ట్‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. ఆదివారం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి శనివారం వాయుగుండంగా మారిందని తెలిపింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మామకన్నులో 12.2 సెం.మీ, ఆదిలాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఇచ్చోడలో 3.7, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగా పూర్‌‌‌‌‌‌‌‌లో 2.9 సెం.మీ. చొప్పున వర్షపాతం రికార్డయ్యింది.

Read also: ZPTC Procession: గుర్రంపై ప్రత్తిపాడు జెడ్పీటీసీ కృష్ణారెడ్డి ఊరేగింపు