తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు పడే ఆవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. దేశంలో పశ్చిమ గాలులతో ఏర్పడిన ఉపరితల ద్రోణి ఏడు రాష్ట్రాలకు విస్తరించింది. అలాగే తూర్పు గాలులతో బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి తమిళనాడు తీరం నుంచి ఒడిసా తీరం వరకు విస్తరించిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై, అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి.
రానున్న రెండు రోజులు దక్షిణ కోస్తా, రాయలసీమలో అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ ఓ మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంది.
ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురిశాయి. అకాల వర్షాలతో పంట ఉత్పత్తులు పాడవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Read more:
ఏపీ సీఎం జగన్‌పై నీతి ఆయోగ్ ప్రశంసలు.. ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయాన్ని అభినందిస్తూ ట్వీట్