Weather: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన!

|

Oct 03, 2023 | 9:49 AM

Telangana, October 03: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపడీనం మరింత బలపడింది. దీని ప్రభావంతో రానున్న రెండు, మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం, విశాఖ వాతావరణం కేంద్రం వెల్లడించాయి. అల్పపీడం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండగా.. కొన్ని జిల్లాల్లో..

Weather: బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన!
Weather Forecast
Follow us on

Telangana, October 03: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపడీనం మరింత బలపడింది. దీని ప్రభావంతో రానున్న రెండు, మూడు రోజులు తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం, విశాఖ వాతావరణం కేంద్రం వెల్లడించాయి. అల్పపీడం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండగా.. కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ కేంద్రం అధికారులు.

అల్పపీడం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని సంగ్గారెడ్డి, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్‌నగర్, మేడ్చల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు పడుతాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణం కేంద్రం అధికారులు. వాతావరణ కేంద్రం ప్రకారం.. మంగళవారం నాడు.. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందన్నారు. ఇక మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

4వ తేదీన కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. 5వ తేదీన మాత్రం చాలా వరకు పొడి వాతావరణం ఉంటుందన్నారు వాతావరణం కేంద్రం అధికారులు. కొన్ని చోట్ల మాత్రం చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పారు. 6, 7, 8 తేదీల్లోనూ వాతావరణం సాధారణ స్థితిలో ఉంటుందని పేర్కొన్నారు.

ఇక ఈ అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రానున్న రెండు రోజుల పాటు తీర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. కోస్తాంధ్ర జిల్లాల్లో పలు చోట్ల చిరు జల్లులు కురుస్తాయని తెలిపారు వాతావరణం కేంద్రం అధికారులు.

మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..